Actor Chekwume Malvin: డ్రగ్స్​ కేసులో 'సింగం' విలన్​​ అరెస్టు!

Actor Chekwume Malvin: సూర్య హీరోగా నటించిన 'సింగం' మూవీ విలన్ అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్  కేసులో చాక్​విమ్​ మాల్విన్ ను  కర్ణాటక పోలీసులు  అరెస్ట్ చేశారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2021, 09:55 PM IST
  • డ్రగ్స్ కేసులో నైజీరియన్ నటుడు అరెస్ట్
  • బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన చాక్​విమ్
Actor Chekwume Malvin: డ్రగ్స్​ కేసులో 'సింగం' విలన్​​ అరెస్టు!

Actor Chekwume Malvin: నైజీరియన్​ దేశస్థుడు, నటుడు చాక్​విమ్​ మాల్విన్..​ డ్రగ్స్​ కేసు(Drugs Case)లో కర్ణాటక పోలీసులకు చిక్కాడు. బెంగళూరు(Bengaluru) కాడుగూండనహళ్లి పోలీసులు అతడ్ని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్​ ఆయిల్​ సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చాక్​విమ్(Actor Chekwume Malvin).. కన్నడ సహా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కనిపించాడు. అన్నబాండ్​, పరమాత్మ వంటి 20 కన్నడ సినిమాల్లో, తమిళ్​లో సింగం, విశ్వరూపం సినిమాల్లో నటించి మెప్పించాడు. మెడికల్​ వీసాపై భారత్​కు వచ్చిన చాక్​విమ్​... ముంబయి(Mumbai)లోని న్యూయార్క్​ ఫిల్మ్​ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అంతకుముందు.. 2006లో అతడు ఆరు నెలలపాటు నైజీరియా రాజధాని అబుజాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ(New York Film Academy)లోనూ శిక్షణ తీసుకున్నాడు.

Also read: Viral: మిస్సయ్యాడు..చివరకు తనను తానే వెతుకున్నాడు..!

లాక్​డౌన్​ సమయంలో సినిమా అవకాశాలు రాకపోగా... చాక్​విమ్​ డ్రగ్స్​(Drugs) అమ్మకాలు ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు. కళాశాల విద్యార్థులు, వ్యాపారులకు అతడు డ్రగ్స్​ సరఫరా చేశాడని తెలిపారు. ఆఫ్రికా నుంచి అక్రమంగా తరలించిన డ్రగ్స్​ను అతడు విక్రయించేవాడని పేర్కొన్నారు. కాడుగూండనహళ్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో మత్తుపదార్థాలను విక్రయిస్తుండగా తాము రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నామని వెల్లడించారు. చాక్​విమ్​ ఎన్నేళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు? అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఈ వ్యవహారంలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News