బిచ్చగాళ్ళకు చేతివృత్తుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం: ఢిల్లీ సర్కార్

ఢిల్లీలో బిచ్చగాళ్ళు లేకుండా చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త విధానానికి రూపకల్పన చేసింది. 

Last Updated : Jun 4, 2018, 11:39 PM IST
బిచ్చగాళ్ళకు చేతివృత్తుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం: ఢిల్లీ సర్కార్

ఢిల్లీలో బిచ్చగాళ్ళు లేకుండా చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త విధానానికి రూపకల్పన చేసింది. యాచకులకు చేతివృత్తుల్లో శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారు స్వయంఉపాధి పొందేందుకు కిట్లు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందుకోసం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సహాయం తీసుకొని స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

యాచకులను స్వయంఉపాధి దిశగా మళ్లిస్తే వారి సంఖ్య తగ్గే అవకాశముందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ సర్కార్ పేర్కొంది. వీరి కోసం ప్రత్యేకంగా రూపొందించే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌‌లో కుట్టు పనులు, చేతివృత్తులు నేర్పిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా శిక్షణ పొందుతున్న సమయంలో వారికి రోజుకు రూ.250 చొప్పున జీవనభృతిని కూడా అందజేయనున్నారు. గతంలో ఎలాంటి జీవనాధారం లేని బిచ్చగాళ్ళను హోమ్స్‌కు తరలించేవారు. కానీ వారు బయటకు వచ్చి తిరిగి అడుక్కొనేవారు.

ఈ క్రమంలో బిచ్చగాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావడానికి ఢిల్లీ సర్కారు ప్రయత్నిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న బిచ్చగాళ్లకు ఐడీ కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైతే వారికి చిన్న మొత్తంలో లోన్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తామని సర్కారు అంటోంది. 

Trending News