High Tension in Karnataka Shivamogga: కర్ణాటకలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. శివమొగ్గ జిల్లాలో ఆదివారం (ఫిబ్రవరి 20) హర్ష (26) అలియాస్ హిందు హర్ష అనే ఓ భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కత్తులతో పొడిచి హతమార్చారు. హత్యను నిరసిస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు.
భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు హిజాబ్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని కర్ణాటక హోంమంత్రి జ్ఞానేంద్ర ప్రకటించారు. హత్యకు గల కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి 9.30గం. సమయంలో హర్ష హత్య జరిగిందని.. ఇప్పటికైతే పలు ఆధారాలను సేకరించామని తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. హత్య ఘటనలో నిజానిజాలు నిగ్గు తేలేంతవరకూ అంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు.
హర్ష హత్యలో నలుగురైదుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు హోంమంత్రి సీఎం బసవరాజ్ బొమ్మైకి నివేదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివమొగ్గలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఘటనపై మండ్యా ఎంపీ సుమలత స్పందిస్తూ.. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొన్ని గ్రూపులు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా హిజాబ్ వివాదం ఇంకా సద్దుమణగకముందే.. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య చోటు చేసుకోవడం మరోసారి హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది.
Also Read: Hurricane Ida: అమెరికాను వణికించిన హరికేన్.. రివర్ నే రివర్స్ చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
High Tension in Karnataka:భజరంగ్‌దళ్ కార్యకర్త హత్య.. కర్ణాటకలో మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు..