PINEWZ App: జీ న్యూస్ మీడియా అధినేత, ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర మరో వినూత్న ఆవిష్కరణకు నాంది పలికారు. దేశమంతా రామమందిరం ప్రారంభోత్సవ పర్యదినం జరుపుకుంటున్న సందర్భంలో సరికొత్త హైపర్ లోకల్ యాప్ PINEWZ లాంచ్ చేశారు. ఈ యాప్ ఇతర న్యూస్ యాప్‌ల కంటే చాలా ప్రత్యేకమైంది.
మీడియా రంగంలో ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడమే కాకుండా విజయవంతంగా నడిపించే సామర్ధ్యం కలిగిన ఎస్సెల్ గ్రూప్ అధినేత డాక్టర్ సుభాష్ చంద్ర మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రామమందిరం ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు అయోధ్యలో ఉన్న ఆయన సరికొత్త న్యూస్ యాప్ Hyper Local App PINEWZ చేశారు. గ్రామం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని డాక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. ఇవాళ్టి రోజు భారతదేశ, ప్రపంచ చరిత్రలో అద్భుతమైన ఘట్టమని ఆయన అన్నారు. కొంతమంది అయోధ్యలో ఉండి రామమందిర ప్రారంభోత్సవాన్ని చూడనుంటే, ఇంకొంతమంది ఇంట్లోంచే ఈ సుమధుర ఘట్టానికి సాక్ష్యంగా నిలవనున్నారని చెప్పారు.
ఈ యాప్‌లో తమ తమ పట్టణాలు లేదా ప్రాంతాల సమాచారం, వీడియోలను అందరూ అప్లోడ్ చేయవచ్చన్నారు. ఇవాళ లాంచ్ కానున్న పీన్యూజ్ యాప్ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి నాంది కానుందన్నారు. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాప్ ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రజలు జర్నలిస్టులు కాగలరన్నారు. మీమీ ప్రాంతాల్లోని వార్తలు , వీడియోలు ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేసి మొత్తం ప్రపంచానికి చూపించవచ్చన్నారు.
On this historic day, Dr @subhashchandra wished the nation and announced the launch of a revolutionary news app, Pinewz. Crores of journalists can now become News Creators using this AI-driven news app. And users can get instant news using their PIN code. #pinewz #RamMandir pic.twitter.com/Mi0aVepBMy
— Zee News (@ZeeNews) January 22, 2024
రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం డాక్టర్ సుభాష్ చంద్ర 45 ఏళ్ల తరువాత అయోధ్య చేరుకున్నారు. రామమందిరం నిర్మాణ సమితి అధ్యక్షులు నృపేంద్ర మిశ్రతో కలిసి రామమందిరాన్ని సందర్శించారు. రామమందిరం ప్రత్యేకతల్ని అడిగి తెలుసుకున్నారు.45 ఏళ్ల తరువాత అయోధ్యకు వచ్చిన ఆయన ఇది ధర్మం సాధించిన విజయంగా పేర్కొన్నారు.
PINEWZ Webpage: https://www.pinewz.com/
Download Link for The App: https://play.google.com/store/apps/details?id=com.mai.pinewz_user
Also read : Ys Sharmila Tour: అప్పుడే జిల్లాల సమీక్షకు సిద్ధమైన షర్మిల, రేపట్నించి 9 రోజుల పర్యటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook