మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి అస్తికలను ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రవహించే అన్ని నదులలో కలపనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బీజేపి నేతృత్వంలోని యోగి ఆదిత్యనాధ్ సర్కార్ శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని గంగ, యమున, తప్తి, గోమతి, సింధు, వరుణతోపాటు ఇతర నదులలోనూ వాజ్‌పేయి అస్తికలను కలపనున్నట్టు యూపీ సర్కార్ ఈ ప్రకటనలో పేర్కొంది. అంతకన్నా ముందుగా మీడియాతో మాట్లాడిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. వాజ్‌పేయి మహోన్నత వ్యక్తిత్వానికి గౌరవసూచికగా తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేశారు.
Ashes of former prime minister #AtalBihariVajpayee will be spread in every river in Uttar Pradesh including Ganga, Yamuna, and Tapti, to respect his grand stature: UP government pic.twitter.com/UC2pW12CIq
— ANI UP (@ANINewsUP) August 17, 2018
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నూమూసిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాల మధ్య ముగిశాయి. మాజీ ప్రధానికి అంతిమ వీడ్కోలు పలికేందుకు దేశం నలమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం వివిధి రాజ్యాధినేతలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.