Election Code Of Conduct 2023: మినీ ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో నేడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పాటు ఈ రాష్ట్రాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం ఎలాంటి నూతన పథకాలు, ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉండదు. ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? ఈ సమయంలో ప్రభుత్వాలు ఏం చేయాలి..? ఎన్నికల కోడ్ గురించి వివరాలు ఇలా..
మోడల్ ప్రవర్తనా నియమావళి అనేది రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసేందుకు రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం అంగీకారంతో రూపొందించారు. అన్ని పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారం, సమావేశాలు, ఊరేగింపులు, పోలింగ్ రోజు కార్యకలాపాలు, ఎన్నికల ప్రక్రియలో ఎలా వ్యవహరించాలో మొత్తం ఎన్నికల కోడ్‌లో ఉంటుంది.
ఎన్నికల కోడ్ లోక్‌సభ ఎన్నికల సమయంలో అయితే దేశం అంతా అమలులో ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే.. ఏ రాష్టంలో ఎన్నికలు జరుగుతాయో ఆ ప్రాంతంలో ప్రవర్తనా నియమావళి వర్తిస్తాయి. బైఎలక్షన్స్ సమయంలో ఆ నియోజకవర్గాలకు మాత్రమే వర్తిస్తుంది. ఎన్నికల క్యాంపెయిన్‌లో ఏ పార్టీ లేదా అభ్యర్థి పరస్పర ద్వేషాన్ని సృష్టించే లేదా వివిధ కులాలు, వర్గాల మధ్య మతపరమైన కామెంట్స్ చేయకూడడు. తప్పుడు ఆరోపణలు లేదా తప్పుడు సందేశం ఇచ్చే విమర్శలు చేయకూడదు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు లేదా ఇతర ప్రార్థనా స్థలాలు వంటి ప్రార్థన మందిరాలను ఎన్నికల ప్రచారానికి వేదికలుగా ఉపయోగించరాదు. ఎన్నికల నిబంధనలను పాటించకపోతే.. క్రమశిక్షణా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఆయా ప్రభుత్వాలు పథకాలు ప్రకటించేందుకు వీలు లేదు. ఆ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రదర్శించే హోర్డింగ్‌లు/ప్రకటనలు మొదలైన వాటిని ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకోకూడదు. అదేవిధంగా న్యూస్ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియాతో సహా ఇతర మాధ్యమాలలో ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదు. నవంబర్ 7న మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. రాజస్థాన్‌లో నవంబర్ 23న, తెలంగాణలో నవంబర్ 30న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.
Also Read: Assembly Elections 2023 Live Updates: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఫలితాలు ఎప్పుడంటే..?
Also Read: CM KCR: ఎన్నికల రంగంలోకి సీఎం కేసీఆర్.. ఆ రోజే మేనిఫెస్టో ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..