Aryan Khan Case: 'ఆర్యన్​ ఖాన్​ను కిడ్నాప్​ చేశారు': మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​

Aryan Khan drug case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్యన్ ఖాన్​ డ్రగ్స్ కేసుపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్​. ఇది కిడ్నాప్, డబ్బు డిమాండ్ కేసు అని ఆరోపించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2021, 03:27 PM IST
  • ఆర్యన్​ ఖాన్ క్రూయిజ్​ పార్టీకి టికెట్ కొనలేదన్న మహారాష్ట్ర మంత్రి
  • ఇది పూర్తిగా కిడ్నాప్​, డబ్బు డిమాండ్ కేసు అని ఆరోపణ
  • ఈ కేసు వెనక కుట్ర కోణం ఉందన్న నవాబ్ మాలిక్​
Aryan Khan Case: 'ఆర్యన్​ ఖాన్​ను కిడ్నాప్​ చేశారు': మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​

Aryan Khan case is kidnapping, ransom: ఆర్యన్​ ఖాన్ డ్రగ్స్​ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు (Nawab Malik on Aryan Khan case) చేశారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్​ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందని తెలిపారు మాలిక్​. దీనంతటికి సూత్రదారి బీజేపీ నేత మోహిత్​ కాంబోజ్ అని ఆరోపించారు.

ఇది కిడ్నాప్​ కేసు..

ఈ కేసు డ్రగ్స్​కు సంబంధించింది కాదని.. కిడ్నాప్​, డబ్బు డిమాండ్​కు సంబంధించిందని (Aryan Khan Drugs case) పేర్కొన్నారు. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే (Sameer Wankhede), మోహిత్‌ కాంబోజ్‌ ఇద్దరూ డబ్బు డిమాండ్‌ చేసిన వారిలో ఉన్నారని ఆరోపించారు. వాళ్లిద్దరికి ముందునుంచే సాన్నిహిత్యం ఉందన్నారు.

షారుక్ ఇప్పటికైనా నోరువిప్పాలి..

ప్లాన్ ప్రకారమే ఆర్యన్ ఖాన్​ను క్రూయిజ్ షిప్​లో పార్టీకి తీసుకెళ్లారని నవాబ్ మాలిక్ అన్నారు. ఆర్యన్​ ఖాన్​ కాకుండా.. ఇద్దరు ఇతర వ్యక్తులు టికెట్ కొని అతన్ని పార్టీకి తీసుకువెళ్లినట్లు ఆరోపించారు. అందువల్లే ఇది కిడ్నాప్​, డబ్బు డిమాండ్​కు సంబంధించిన కేసు అని చెప్పుకొచ్చారు.

ఆర్యన్ ఖాన్​ను అరెస్ట్​ చేసినప్పటి నుంచి షారుక్​కు బెదిరుపులు మొదలయ్యాయని.. ఈ విషయాలేవీ బయటకు చెప్పొద్దని కూడా సూచించినట్లు నవాబ్ మాలిక్​ వివరించారు. ఇప్పటికైనా షారుక్ నోరు విప్పి నిజాలు బయటకు చెప్పాలని కోరారు.

Also read: Chennai Heavy Rain: భారీవర్షం కారణంగా చెన్నైలో నిలిచిన ట్రాఫిక్.. నీటమునిగిన ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటన

Also read: PM Modi: ప్రపంచంలోనే పాపులారిటీలో నెంబర్‌ వన్‌గా మోదీ..తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..

ఇదంతా కుట్ర..

అసలు ఈ వ్యవహారమంతా ఓ కుట్రలో భాగమేనని నవాబ్​ మాలిక్ ఆరోపించారు. షిప్​లో ఇతర ప్రముఖులకు సంబంధించి ఆధారాలు దొరికినా వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఇదంతా చేశారని కూడా ఆరోపించారు.

Also read: Corona Cases In India: దేశంలో కొత్తగా 10,853 కొవిడ్ కేసులు.. 526 మరణాలు

Also read: Chennai Floods: చెన్నైని ముంచెత్తనున్న వర్షాలు, వెంటాడుతున్న 2015 వరద భయం

నవాబ్ మాలిక్ వరుస ఆరోపణలు..

ఆర్యన్​ ఖాన్​ కేసులో నవాబ్​ మాలిక్ ఆరోపణలు చేయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా పలు ఆరోపణలు చేశారు. వరుస ట్వీట్​లతో ఎన్​సీబీపై ప్రత్యక్షంగా పశ్నల వర్షం కురిపించారు. 

ఇక సమీర్​ వాంఖడే అసలు జీవితం ఇదే అంటూ పలు ఫొటోలను కూడా షేర్ చేశారు మాలిక్​.

Also read: BJP MP Controversial Comments:మా నేతను అడ్డుకుంటే కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తానంటూ వార్నింగ్

ఎన్​సీబీ ఏమందంటే..

నవాబ్​ మాలిక్​ వరుస  ఆరోపణలపై ఎన్​సీబీ కూడా స్పందించింది. మాలిక్ ఆరోపణలను చేసేబదులు కోర్టు్కు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించింది. 

సమీర్ వాంఖడేను ఈ కేసు నుంచి తప్పించేందుకు ముందు.. తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేయడం గమనార్హం.

నవాబ్ మాలిక్​పై పరువు నష్టం దావా..

ఈ కేసు విషయంలో నవాబ్​ మాలిక్ చేసిన ఆరోపణలనపై సమీర్​ వాంఖడే  తండ్రి తీవ్రంగా స్పందించారు. ఆయనపై పరువు నష్టం దావా వేశారు. సమీర్ వాంఖడే నిజానికి ముస్లీం అని.. అయితే ఎస్సీ సర్టిఫికేట్ సాధించి ఉద్యోగం సంపాదించాడని నవాబ్​ మాలిక్ గతంలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సమీర్ వాంఖడే తండ్రి పరువునష్టం దావా వేసినట్లు తెలిస్తోంది.

Also read: Rakesh Tikait: 'బీజేపీ, ఆరెస్సెస్​ ప్రజల ఐక్యతను దెబ్బతియాలనుకుంటున్నాయి జాగ్రత్త'

Also read: Yogi Adityanath: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఎక్కడి నుంచి పోటీ... ఇదీ ఆయన రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News