ఇండో చైనా సరిహద్దు వివాదం ( Indo china border dispute ) , దేశ భద్రత, హనీట్రాప్ ( Honetrap ) వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ తాజాగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ఆర్మీ అదికారి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ను ( Ban on Facebook ) నిషేధించడాన్ని ఆయన సవాలు చేశారు.
భారతదేశ ఆర్మీలో పని చేసే అధికారులు, సైనికులు ఫేస్ బుక్ ( Facebook ) తో పాటు మొత్తం 89 యాప్ లను తొలగించాలంటూ ఇటీవల ఆదేశాలు వెలువడ్డాయి. దేశభద్రత, హనీట్రాప్, ఇండో చైనా సరిహద్దు వివాదం వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఆర్మీ ( Indian Army ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆదేశాల్ని పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని కూడా ఇండియన్ ఆర్మీ హెచ్చరించింది. దేశ భద్రతకు సంబంధించిన డేటా ఈ యాప్ ల ద్వారా లీకవుతుందనేది ఆర్మీ ఆందోళనగా ఉంది. Also read: Indian Army: ఇకపై ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు వాడితే చర్యలు
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ అధికారి ఒకరు సుప్రీంకోర్టులో ( Supreme court ) పిటీషన్ దాఖలు చేశారు. మంగళవారం నాడు విచారణకు రానున్న ఈ పిటీషన్ ను ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ( Leutenant colonel ) పీకే చౌదరి ఫైల్ చేశారు. ఆర్మీ తీసుకున్న ఈ నిర్ణయం వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పీకే చౌధరి ( pk Choudhary ) పిటీషన్ లో తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి కుటుంబసభ్యులతో టచ్ లో ఉండటానికి పేస్ బుక్ లాంటి యాప్స్ ఉపయోగపడుతున్నాయని పిటీషనర్ తెలిపారు.
అయినా రహస్య సమాచారం ముఖ్యంగా ఉండే ప్రజా నాయకులు, ఉన్నతాధికార్లకు ఈ నిబంధనలు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు పిటీషనర్ పీకే చౌధరి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్ ( Director General of Military Intelligence ) జారీ చేసిన ఈ నిషేధాజ్ఞల్ని వెనక్కి తీసుకోవాలని పిటీషనర్ కోరారు. Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం
ఆర్మీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అదే ఆర్మీలో అధికారిగా ఉన్న వ్యక్తి కోర్టులో ఛాలెంజ్ చేయడం ప్రాధాన్యత రేపుతోంది. దేశభద్రతకు సంబంధించిన సమస్యగా ఆర్మీ భావిస్తున్న నేపధ్యంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. Also read: Supreme court: ఆ గది తాళాలు వారివే