Regional Passport Office: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. త్వరలో రాష్ట్రంలో మరో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నంలో ఓ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం ఉండగా, ఇది రెండవది కానుంది.
ఏపీలో ఇప్పటి వరకూ విశాఖపట్నం కేంద్రంగా ఓ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఉంది. ఇది కాకుండా కొన్ని జిల్లాల పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నాయి. ఇప్పుడు త్వరలో మరో పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయాన్నివిజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే విజయవాడ కేంద్రంగా ఏపీలో రెండవ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ప్రస్తుతం విజయవాడలో ఇతర జిల్లాల్లో ఉన్నట్టే పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందుతున్నాయి. ఈ కేంద్రానికి రోజుకు 2 వేలకు పైగా అప్లికేషన్లు వస్తుండటంతో పని ఒత్తిడి పెరుగుతోంది. విజయవాడలో త్వరలో ఏర్పాటు కానున్న ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంతో పాస్‌పోర్ట్ సేవలు విస్తృతం కానున్నాయి. మరింత త్వరగా పాస్‌పోర్ట్ అందుతుంది.
విజయవాడలో కొత్తగా ఏర్పాటు కానున్న ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలోనే పాస్‌పోర్ట్ ప్రింటింగ్ కూడా ఉంటుంది. దాంతో పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ మరింత వేగవంతమౌతుంది. మరో 2-3 నెలల్లోనే ఈ సెంటర్ ప్రారంభం కావచ్చు.
Also read: AP Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook