IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండమైంది. ఫలితంగా మొన్నటి నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటినా ఇంకా భారీ వర్షాలు ముప్పు మాత్రం తొలగలేదు. రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి.
వాయగుండం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకధాటిగా వర్షం పడుతోంది. ప్రధాన రహదారులపై నీరు చేరింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై చాలా చోట్ల వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం భారీ వర్షాలు పడుతున్నాయి. హనుమకొండ, ఖాజీ పేట ప్రదాన రహదారిపై వర్షపు నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో మిర్యాలగూడ మీదుగా నల్గొండ-నార్కెట్ పల్లి వైపుకు మళ్లించారు.
ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట్, గద్వాల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు. ఇక కొమురం భీమ్, ములుసు భద్రాద్రి, వరంగల్, ఖమ్మం, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఏపీలో రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. విజయవాడను ఇప్పుడు బుడమేరు ముంచెత్తింది. 2009 తరువాత ఇదే భారీ వర్షం. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి 5.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రానుంది. మున్నేరు వాగు నుంచి ఆకస్మిక వరద పొంచి ఉంది. ఇవాళ ఉదయం ప్రకాశం బ్యారెజ్ నుంచి అవుట్ ఫ్లో 5 లక్షల 37 వేల క్యూసెక్కులుంది. కే కొత్తపాలెం, పల్లెపాలెం, ఆముదార్లంకలకు వరద ముప్పు పొంచి ఉండటంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also read: Telangana Heavy Rains: తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.