IMD Heavy Rains Alert: దట్టమైన మేఘాలతో ఏపీ, తెలంగాణల్లో చీకటి, అతి భారీ వర్షాల హెచ్చరిక

AP Telangana Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ద్రోణి బలపడుతూ సముద్రమట్టంపై కొనసాగుతోంది. ఫలితంగా  ఏపీ, తెలంగాణల్లో ఇవాళ్టి నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆరంజ్ అలర్ట్ కూడా జారీ అయింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 18, 2024, 08:21 AM IST
IMD Heavy Rains Alert: దట్టమైన మేఘాలతో ఏపీ, తెలంగాణల్లో చీకటి, అతి భారీ వర్షాల హెచ్చరిక

AP Telangana Heavy Rains Alert: మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ్టి నుంచి 3-4 రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తత జారీ చేశారు. కొన్ని జిల్లాలకు ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ముసురు వాతావరణం నెలకొంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలకు తోడు నైరుతి రుతు పవనాలుండటంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 3-4 రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు తెలంగాణలోని కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వరంగల్, ఆసిఫాభాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. 

ఇక హైదరాబాద్ లో కూడా ఇవాళ, రేపు వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఉరుములు, మెరుపులతో గాలులు వీస్తాయి. పిడుగులు పడే ప్రమాదముంది. మోస్తరు నుంచి భారీ వర్షం ఇవాళ సాయంత్రం నుంచి నమోదయ్యే అవకాశముంది. 

ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో జూలై 18, 19 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాలు పడేటప్పుడు ఈదురు గాలులు వీయనున్నాయి. దాంతోపాటు పిడుగులు పడే ప్రమాదమున్నందు ఆరుబయట, చెట్ల కింద, విద్యుత్ స్థంబాలు, టవర్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అంటే మొత్తం కోస్తా ప్రాంతం ప్రభావితం కానుంది. ఇక రాయలసీమలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

Also read: Farmer Loan Waiver: ఇవాళ్టి నుంచే రుణమాఫీ, ఎవరు అర్హులు, ఎవరు కాదో ఇలా తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News