Corona Fourth Wave Fear: కరోనా ఫోర్త్‌వేవ్ భయమే అంతా కన్పిస్తోంది. కేంద్రం కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో ఐదు రాష్ట్రాల్ని అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేసింది.
దేశంలో కరోనా కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కన్పిస్తోంది. అదే సమయంలో ఢిల్లీ, నోయిడాలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. చిన్నారుల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో పెరుగుతున్న కరోనా సంక్రమణ, కరోనా ఫోర్త్‌వేవ్ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది.
కరోనా ఫోర్త్‌వేవ్ భయం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం..హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మిజోరాం, మహారాష్ట్రలను అప్రమత్తం చేసింది. కరోనా సంక్రమణపై దృష్టి సారిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, కోవిడ్ మేనేజ్‌మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు ఆ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక భాగం కేసులు ఈ రాష్ట్రాల్నించే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ రేటు కూడా అధికంగా ఉంది.
ప్రమాద తీవ్రతను అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఆర్ధిక, సామాజిక కార్యకలాపాలు నిలిచిపోకుండా, ఆదాయ మార్గాలు కోల్పోకుండా మహమ్మారి నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా మిజోరాం, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో అప్రమత్తత అవసరమని పేర్కొంది. కోవిడ్ సంక్రమణను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్ నియంత్రణకు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని రాష్ట్రాల్ని కోరింది.
ఐదంచెల వ్యూహంలో భాగంగా టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్, కోవిడ్ ప్రవర్తానావళి అమలు పగడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్ల మాస్క్ తప్పకుండా ధరించేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసరమైతే..మహమ్మారి విస్తరించకుండా నిరోధించేందుకు అవసరమైన ఏ చర్యలనైనా తీసుకోవాలని సూచించింది. కోవిడ్ నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలని తెలిపింది.
Also read:
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook