Agnipath recruitment scheme: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎగిసిపడుతున్న నిరసనలతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దిగివచ్చి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అగ్నిపథ్ స్కీమ్ లో ఎంపికయ్యే అగ్నివీరులకు రిజర్వేషన్లు ప్రకటించింది. కొన్ని మినహాయింపులు ప్రకటించింది. సడలింపులు ఇస్తూనే అగ్నిపథ్ కింద నియామకాలకు వడివడిగా అడుగులు వేస్తోంది కేంద్రం. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ వివరాలను విడుదల చేసింది.
అగ్నిపథ్ స్కీంలో భాగంగా వాయుసేనలో చేపట్టబోయే నియామక వివరాలను ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. వాయుసేనలో అగ్నిపథ్ స్కీంలో నియామకమయ్యే అగ్నివీరుల పర్యవేక్షణ 1950 ఎయిర్ ఫోర్స్ యాక్ట్ కింద ఉండనుంది. ఆన్‌లైన్ పరీక్షలు, ఇతర విధానాల ద్వారా నియామకాలు జరుగుతాయి. ఇందుకోసం ప్రత్యేక ర్యాలీలు నిర్వహిస్తారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌లో గుర్తింపు పొందిన టెక్నికల్ సంస్థల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుపుతారు.
ఎయిర్ ఫోర్స్ లో ప్రస్తుతం ఉన్న ర్యాంకులకు భిన్నంగా అగ్నివీరులకు ప్రత్యేక ర్యాంక్ కేటాయిస్తారు. అగ్నిపథ్ కింద వాయుసేనకు ఎంపికైన అభ్యర్థులు.. అన్ని నిబంధనలు అంగీకరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పత్రాలపై అభ్యర్థులు సంతకం చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు 18 ఏళ్ల లోపు వారైతే.. వాళ్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సైన్ చేసి ఇవ్వాలి. ఆర్మీలో ప్రస్తుతం ఇస్తున్న సేవా పతకాలు, అవార్డులకు అగ్నివీరులు కూడా అర్హులే. వాయుసేనకు ఎంపికయ్యే అగ్నివీరులకు 30 రోజుల వార్షిక సెలవులు వర్తిస్తాయి. ఆరోగ్య సమస్యలను బట్టి సిక్‌లీవ్‌లు కూడా ఇస్తారు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా 281 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. టెన్త్,ఇంటర్, డిగ్రీ విద్యార్హతలను బట్టి పోస్టులను కేటాయించారు. 20 నుంచి 28 ఏళ్ల మధ్యవారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఎంపికకు అర్హులు. ఈనెల 28లోపు బీఎస్‌ఎఫ్ అధికారిక సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, డాక్యుమెంటేషన్, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్‌ల్లో పాస్ కావాలి. నెలకు రూ.35 వేల 400 బేసిక్ పేతోపాటు ఇతర అలవెన్సులు, అదనపు బెనిఫిట్స్ ఉంటాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది.
Read also: Covid Cases in India: దేశంలో 72 వేలు దాటిన యాక్టివ్ కేసులు.. కొవిడ్ ఫోర్త్ వేవ్ అలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook