ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ లో పాల్గొన్న ఇద్దరు పైలట్లు గల్లంతయ్యారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం బుధవారం జమ్ముకశ్మీర్ లోని బుద్గాం ప్రాంతంలో భారత్ కు వాయుసేనకు చెందిన మిగ్ -21 కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు గల్లంతయ్యారు.
సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందా? లేక యుద్ద సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుందా? అనే విషయంలో స్పష్టత లేదు. యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. తాజా ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో భారత వాయుసేన సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడం... ఈ దాడుల్లో దాదాపు 300 మందికి పైగా హతమైన విషయం తెలిసిందే. ఉగ్రమూకల ఏరివేత కార్యక్రమంలో భాగంగా వాయిసేన యుద్ధవిమానాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపటడుతోంది. ఈ క్రమంలో యుద్ధవిమనాం కుప్పకూలిపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది