ED: మరోసారి అహ్మద్ పటేల్ విచారణ

కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీలో నెంబర్ 2 అహ్మద్ పటేల్ ( Ahmed patel ) పై ఉచ్చు బిగుస్తోంది. వరుసగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate ) ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 14 వేల 5 వందల కోట్ల రుణం ఎగవేతతో అహ్మద్ పటేల్ కు ఉన్న సంబంధమేంటి ? ఈడీ విచారణపై అహ్మద్ పటేల్ ఏమన్నారు ?

Last Updated : Jul 9, 2020, 02:57 PM IST
ED: మరోసారి అహ్మద్ పటేల్ విచారణ

కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీలో నెంబర్ 2 అహ్మద్ పటేల్ ( Ahmed patel ) పై ఉచ్చు బిగుస్తోంది. వరుసగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate ) ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 14 వేల 5 వందల కోట్ల రుణం ఎగవేతతో అహ్మద్ పటేల్ కు ఉన్న సంబంధమేంటి ? ఈడీ విచారణపై అహ్మద్ పటేల్ ఏమన్నారు ?

మనీ ల్యాండరింగ్ ( Money laundering ) కేసు, బ్యాంకు స్కాంకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సోనియా గాంధీ కుటుంబ విధేయుడైన అహ్మద్ పటేల్ ను ఈడీ ( ED ) వదిలేలా కన్పించడంలేదు. జూన్ లో మొదలైన ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికి నాలుగుసార్లు ఈడీ పదే పదే అహ్మద్ పటేల్ ను ప్రశ్నించింది. తొలిసారి జూన్ 27వ తేదీన, రెండోసారి జూన్ 30న, మూడోసారి జూలై 2వ తేదీన ప్రశ్నించింది. గురువారం నాడు వరుసగా నాలుగోసారి ఈడీ అహ్మద్ పటేల్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. నాలుగుదఫాల్లో కలిపి ఇప్పటివరకూ 27 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. Also read: Remdesivir: ఆకాశాన్నంటుతున్న కరోనా మందు ధర

ముఖ్యంగా 14 వేల 5 వందల కోట్ల బ్యాంకు రుణం ఎగవేతపైనే ప్రదానంగా అహ్మద్ పటేల్ ను ప్రశ్నించారు. వడోదరకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ ( Sterling Biotech ) ప్రమోటర్లుగా ఉన్న నితిన్ సందేశార, చేతన్ సందేశార , దీప్తి సందేశారలు బ్యాంకు నుంచి 14 వేల 5 వందల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారు. ఈ స్కామ్ తో అహ్మద్ పటేల్ కు సంబంధముందనే ఆరోపణలపై ఈడీ ప్రధానంగా విచారిస్తోంది. స్టెర్లింగ్ ప్రమోటర్లతో అహ్మదే పటేల్ కు ఉన్న సంబంధాలపై ఈడీ పలురకాలుగా ఆరా తీసినట్టు సమాచారం. Also read: Covid19: కరోనా వైరస్ సంక్రమణపై కేంద్ర కీలక ప్రకటన

అయితే ఈ కేసుకు తనకు ఏ మాత్రం సంబంధం లేదని అహ్మద్ పటేల్ అంటున్నారు. ఈడీ ఇప్పటివరకూ తనను 128 ప్రశ్నలు కురిపించిందని ఆయన వెల్లడించారు. ఇది పూర్తిగా రాజకీయ వేధింపులేనని, ఎవరి ఒత్తిళ్లపై అధికారులు పనిచేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.

Trending News