ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రి రికార్డు స్థాయిలో పేషెంటు వద్ద ఫీజు వసూలు చేసిన ఘటన మరిచిపోక ముందే.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి అదే బాటలో పయనించింది. డెంగ్యూ జ్వరం వచ్చి ఓ బాలుడు ఆసుపత్రిలో చేరితే.. దాదాపు 21 రోజులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు ఆ తర్వాత చేతులెత్తేసి.. కేసును ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
అయితే ఇంతలోనే బాలుడు చనిపోవడంతో ఫీజు క్రింద 16 లక్షల రూపాయలు చెల్లించాలని పేషెంటు తల్లిదండ్రులను ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. ఏంచేయాలో కూడా తెలియని పరిస్థితిలో బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషనులో ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా సాదర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలియజేశారు.