Aero india 2023: ఆసియాలోనే అతి పెద్ద ఏరో షో.. ఇవాళ బెంగళూరులో ప్రారంభించనున్న మోదీ..

Aero india 2023: నేటి నుంచి బెంగళూరులో ఏరో ఇండియా-2023 ప్రదర్శన ప్రారంభం కానుంది. దీనిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2023, 08:53 AM IST
Aero india 2023: ఆసియాలోనే అతి పెద్ద ఏరో షో.. ఇవాళ బెంగళూరులో ప్రారంభించనున్న మోదీ..

Asia's Biggest Aero Show In Bengaluru Today: ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో ఏరో ఇండియా 2023ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బెంగళూరులో ప్రారంభించనున్నారు. ఇది 14వ ఎడిషన్. "ది రన్‌వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్‌" అనే థీమ్ తో ఈ వైమానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.  ఈ ప్రారంభ కార్యక్రమంలో 98 దేశాల నుండి 809 కంపెనీలు పాల్గొంటాయని భావిస్తున్నారు. ఈ ఎయిర్ షో నేటి నుండి 17 తేదీ వరకు నిర్వహించనున్నారు. వివిధ భారతీయ మరియు విదేశీ రక్షణ సంస్థల మధ్య ₹ 75,000 కోట్ల పెట్టుబడుల అంచనాతో 251 ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

ఈ కార్యక్రమంలో 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొనున్నారు. ‘ఈ ఈవెంట్ లో ఇండియా పెవిలియన్’ మొత్తం 115 కంపెనీలను కలిగి ఉంటుంది. LCAతో సహా 227 ఉత్పత్తులను ప్రదర్శంచనుంది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) ప్రముఖ యుద్ధ విమానాలలో ఒకటైన F-16 ఫైటింగ్ ఫాల్కన్ ద్వయం రోజువారీ వైమానిక ప్రదర్శనలను నిర్వహించనుంది. F/A-18E మరియు F/A-18F సూపర్ హార్నెట్, US నేవీ యొక్క అత్యంత అధునాతన ఫ్రంట్‌లైన్ క్యారియర్-ఆధారిత మల్టీరోల్ స్ట్రైక్ ఫైటర్ ఈరోజు అందుబాటులో ఉండనున్నాయి. ఇవన్నీ స్టాటిక్ డిస్‌ప్లేలో ఉంటాయి.

Also Read: Maha Shivratri 2023: మహా శివరాత్రి స్పెషల్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News