Jayaprada Missing: జయప్రద కన్పించడం లేదు..గాలిస్తున్న యూపీ, ఢిల్లీ పోలీసులు

Jayaprada Missing: టాలీవుడ్ కం బాలీవుడ్ మేటి నటి జయప్రద విషయంలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇవాళ ఉదయం నుంచి ఆమె కన్పించడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసలేం జరిగింది..ఆమెకేమైంది..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 30, 2023, 04:21 PM IST
 Jayaprada Missing: జయప్రద కన్పించడం లేదు..గాలిస్తున్న యూపీ, ఢిల్లీ పోలీసులు

Jayaprada Missing: టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి మేటి నటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా రాజకీయాల్లో సైతం తనకంటూ ఖ్యాతి సంపాదించిన నటి జయప్రద. ఇప్పుడు ఉదయం నుంచి ఆమె కన్పించడం లేదనే వార్త వైరల్ అవుతోంది. ఆమె ఎక్కడికి వెళ్లింది, ఏమైందనేది తెలియడం లేదు. 

అసలు జయప్రద మిస్సింగ్ అనే వార్త వ్యాపించడానికి కారణం ఆమెపై జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లో ఆమె ప్రాతినిధ్యం వహించి రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో నిలిచిన జయప్రద కోడ్ అమల్లో ఉన్నా కూడా ఓ రోడ్డును ప్రారంభించారు. దాంతో అక్కడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై..ఇప్పటికీ ఆ కేసు రాంపూర్ కోర్డులో నడుస్తోంది. ఈ కేసులో ఎన్నిసార్లు కోర్టు కోరినా ఇప్పటివరకూ ఆమె హాజరుకాలేదు. దాంతో ఆగ్రహించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత నెల అంటే నవబంర్ 8వ తేదీన విచారణకు వచ్చింది. నవంబర్ 17న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇన్ని రోజులూ కోర్టు సమయం వృధా చేయడంతో ఆగ్రహించిన కోర్టు జనవరి 10వ తేదీ లోగా జయప్రదను కోర్టులో హాజరుపర్చాలని రాంపూర్ పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. 

రాంపూర్ కోర్టు ఆదేశాలతో ఆమె ఇంటికి వెళితే అక్కడామె అందుబాటులో లేదు. ఎక్కడికి వెళ్లిందో తెలియదు. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. కోర్డు ఆగ్రహంగా ఉండటంతో యూపీ అంతా ఆమెకోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. జయప్రదను వెతికి పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసుల సహాయం కోసం తీసుకుంటున్నారు యూపీ పోలీసులు. 

Also read: Aadhaar Card Address Update: ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News