అభినందన్ వర్థమాన్ ఖాతాలో అరుదైన రికార్డ్

అభినందన్ వర్థమాన్ ఖాతాలో అరుదైన రికార్డ్

Last Updated : Mar 3, 2019, 05:29 PM IST
అభినందన్ వర్థమాన్ ఖాతాలో అరుదైన రికార్డ్

న్యూఢిల్లీ: భారత్‌లోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడటానికి వచ్చిన పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన మన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ పైలట్ అభినందన్ వర్థమాన్ తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడని ఎయిర్ చీఫ్ మార్షల్ కృష్ణస్వామి అన్నారు. ఎఫ్-16 విమానాన్ని కూల్చేసిన తొలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంబాట్ పైలట్‌గా అభినందన్ అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నట్టు కృష్ణస్వామి తెలిపారు. అంతేకాకుండా మిగ్ -21 బైసన్ జెట్ ఫైటర్‌లో వెళ్లి అంతకన్నా ఇంకాస్త ఆధునిక యుద్ధ విమానమైన ఎఫ్-16ను కూల్చిన తొలి పైలట్ అతడే కావడం విశేషం అని కృష్ణస్వామి అభినందన్‌ని అభినందించారు. అభినందన్ సాధించిన ఘనత గురించి కృష్ణస్వామి మాట్లాడుతూ.. మన ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా దేశ రక్షణకు సంబంధించ ఏ యుద్ధ సామగ్రి కొనుగోలు చేయాలన్నా.. ఏళ్లకు ఏళ్ల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

భారత అమ్ముల పొదిలో ఒకటైన మిగ్-21 బైసన్ నడిపే పైలట్లు తమ నైపుణ్యం పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా అప్పుడప్పుడూ మిరాజ్-2000, మిత్ర దేశాలకు చెందిన ఎఫ్-16లతో శిక్షణ పొందుతుంటారు. అభినందన్ వర్థమాన్ సైతం అలా శిక్షణ పొందిన పైలటే కావడంతో ఆ శిక్షణ ఆయనకు పాకిస్తాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టడంతోపాటు ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసేందుకు ఉపయోగపడిందని కృష్ణస్వామి తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేయడం అనేది సాధారణమైన విషయం కాదని అభినందన్‌ని ప్రశంసల్లో ముంచెత్తారు.

Trending News