అసలే ఎండాకాలం.. సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. భగభగ మండిపోతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. దీంతో సూర్యతాపం తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు. మూగ జీవాలను కూడా ఇబ్బంది పెడుతోంది.
వేసవితాపాన్ని తట్టుకోలేక చల్లదనం కోసం మూగజీవాలు బయటకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న విశాఖపట్నం జిల్లా తల్లాడపల్లి గ్రామంలో ఓ కింగ్ కోబ్రా జనావాసాల్లోకి రావడం చూశాం. ఐతే అటవీశాఖ సిబ్బంది మళ్లీ దాన్ని అడవిలోకి పంపించారు.
వామ్మో..!! ఎంత పెద్ద పాము..!!
ఐతే మరో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏకంగా కింగ్ కోబ్రాకు స్నానం చేయించాడు. దీన్ని అటవీ శాఖ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి స్నానం చేయిస్తుంటే ... కింగ్ కోబ్రా కూడా చక్కగా చల్లదనాన్ని అస్వాదించడం వీడియోలో కనిపిస్తోంది.
Summer time..
And who doesn’t like a nice head bath🙏Can be dangerous. Please don’t try. pic.twitter.com/ACJpJCPCUq
— Susanta Nanda IFS (@susantananda3) May 24, 2020
ఐతే దీన్ని ఎవరూ ప్రయత్నించవద్దని అటవీ అధికారి సుశాంత నంద కోరారు. బహుశా ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నిపుణుడు అయి ఉంటారని పేర్కొన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..