Sunny Deol Shatrughan Sinha: ప్రజలు ఓట్లేసి గెలిపించి చట్టసభలకు పంపిస్తే వాళ్లు పదవిలో కొనసాగుతున్నారు. కానీ ఉన్నా లేనట్టే మాదిరి తయారయ్యారు. పదవీకాలంలో ఒక్కసారి తమను గెలిపించిన ప్రజల కోసం నోరు మెదపని వాళ్లు ఉన్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా 'అధ్యక్షా' అని పలకని లోక్‌సభ సభ్యులు ఉన్నారంటే ఎంతటి దౌర్భాగ్యం. ప్రజలు ఇచ్చిన తీర్పును నిర్వీర్యమైనట్టే. పార్లమెంట్‌లో నోరుమెదపని ఎంపీలు తమ పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. అలా ఏకంగా 9 మంది ఎంపీలు ఉండడం గమనార్హం.
Also Read: Why Modi Photos: అక్కడ ప్రధాని మోదీ ఫొటోలు ఎందుకయ్య? అవసరమా? ముఖ్యమంత్రి నిలదీత
ప్రస్తుత 17వ లోక్‌సభ పదవీకాలం ముగుస్తోంది. ఈ సభ కాలం మొత్తంలో నోరు మెదపని ఎంపీలు 9 మంది ఎంపీలు ఉన్నారు. తమ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ప్రశ్నను కూడా అడగలేదు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. పార్లమెంట్ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. ఒక్కసారి పార్లమెంట్‌లో అధ్యక్షా అని మాట్లాడలేదు. సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన వారు మళ్లీ పార్లమెంట్ ముఖం చూడలేదని తెలుస్తోంది. లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ 9 మందిలో సినీ రంగానికి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఉండడం గమనార్హం.
Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్
పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీలుగా ఎన్నికైన సినీ ప్రముఖులు శతృఘ్న సిన్హా, సన్నీ డియోల్ ఈ పార్లమెంట్‌లో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. శత్రుఘ్న సిన్హా బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ చంద్రప్ప జిగజినాగి కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ నియోజకవర్గం నుంచి ఎంపీ అతుల్ రాయ్ కూడా లోక్‌సభలో మాట్లాడని జాబితాలో ఉన్నారు. మాట్లాడని ఎంపీల్లో అత్యధికంగా అధికార బీజేపీకి చెందినవారే ఉన్నారు. వారిలో కర్ణాటకకు చెందిన వారు ఉన్నారు. పార్లమెంట్ వ్యవహారాల్లో వారి హాజరు శాతం చాలా తక్కువగా ఉన్నారు.
లోక్‌సభలో మాట్లాడని ఎంపీలు వీరే..
అయితే 9 మంది ఎంపీలు మాట్లాడకపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఆ ఎంపీల్లో కొందరు అనారోగ్యంతో బాధపడుతుండగా.. మరికొందరు న్యాయ చిక్కుల్లో చిక్కుకున్నారు. మరొకరు జైల్లో ఉన్నారు. కాగా, పదవీకాలం ముగుస్తున్న 17వ లోక్‌సభలో సభా వ్యవహారాలు కీలకంగా జరిగాయి. మొత్తం 222 బిల్లులు ఆమోదం తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో 1,116 ప్రశ్నలు లేవనెత్తారు. శూన్య గంటలో (జీరో అవర్) 5,568 వివిధ అంశాలపై చర్చలు జరిగాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Parliament: ఒక్కసారి 'అధ్యక్షా' అనని ఎంపీలు.. వీళ్లు ఎంపీలుగా ఎన్నికై ఏం ప్రయోజనం?