8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం మరో రెండేళ్లలో ముగియనుంది. అందుకే ఇప్పట్నించే 8వ వేతన సంఘం అమలు కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలం నుంచి 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. 2016 జనవరి 1న ప్రారంభమైన 7వ వేతన సంఘం పదేళ్లు అమల్లో ఉంటుంది. అంటే 2026 వరకు ఉంటుంది. 8వ వేతన సంఘం అమల్లోకి రావాలంటే రెండేళ్లు పడుతుంది. దాదాపు 1 కోటిమందికి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 8 వ వేతన సంఘం ఏర్పాటుకు ఆలోచిస్తోంది. జీతం, పెన్షన్ల విషయంలో ఇది కచ్చితంగా బిగ్ ఛేంజ్ కానుంది.
7వ వేతన సంఘం ప్రకారం 3.68 శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలనేది ఓ డిమాండ్. కానీ కేంద్ర ప్రభుత్వం 2.57 శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చింది. గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దాదాపు ఏడాదికాలంగా డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్లోగానీ తరువాత గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారేటప్పుడు ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ జీతం పెంపును 3.68 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 2.57 శాతమే పెంచింది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది. పెన్షన్ 3500 నుంచి 9 వేలకు పెరిగింది.
ఇప్పుడు 8వ వేతన సంఘం అమలైతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతం కావచ్చు. దాంతో ఉద్యోగుల జీతం 18 వేల నుంచి 34,560 రూపాయలు కావచ్చు. ఇక పెన్షన్ అయితే ఏకంగా 17,2890 రూపాయలు ఉంటుంది.
Also read: LIC Policy Restart: ఎల్ఐసీ పాలసీ మధ్యలో వదిలేశారా మళ్లీ రీస్టార్ట్ చేయొచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook