8th Pay Commission: న్యూ ఇయర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..? కొత్త పే కమిషన్‌పై నిర్ణయం..!

8th Pay Commission Latest Updates: కొత్త ఏడాదిలో 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 07:31 PM IST
8th Pay Commission: న్యూ ఇయర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..? కొత్త పే కమిషన్‌పై నిర్ణయం..!

8th Pay Commission Latest Updates: 8వ వేతనం సంఘం అమలు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్‌లో కొత్త పే కమిషన్‌ ప్రకటన వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఆందోళనలు చేస్తుండగా.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు అయితే దాదాపు 48.67 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో లేదని ఇటీవల వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతకుముందు 2013 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఎ ప్రభుత్వం 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది 2016 నుంచి అమలులోకి వచ్చింది. వచ్చే ఏడాది కూడా 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎనిమిదో తేదీన కమిషన్ అమలుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణాన్ని మార్చడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో మొదటి పే కమిషన్ జనవరి 1946లో ఏర్పాటైంది. 1947 నుంచి ఇప్పటివరకు 7 పే కమిషన్‌లు ఏర్పాటయ్యాయి.  

7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగులకు బేసిక్ పే రూ.18 వేలు. ప్రస్తుతం డీఏ, డీఆర్ 46 శాతం అందుతోంది. ఏడాది ప్రారంభంలో 38 శాతం ఉండగా.. రెండుసార్లు 4 శాతం చొప్పున కేంద్రం పెంచింది. దీంతో 46 శాతానికి చేరుకుంది. కొత్త సంవత్సరంలో మరోసారి 4 శాతం పెంచితే.. డీఏ 50 శాతానికి చేరుకుంటుంది. అప్పుడు మొత్తాన్ని బేసిక్ పేలో కలిపేసి.. డీఏను జీరో నుంచి లెక్కించాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో కేంద్రం కొత్త పే కమిషన్ తీసుకువస్తుందా.. లేదంటే రూల్స్ మారుస్తుందా వేచి చూడాలి. 

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

Also Read: Devil Movie Review: కళ్యాణ్‌ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News