Bus Accident in Punjab: పంజాబ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కాలువలో పడి పోయిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ముక్త్సర్(Muktsar) సాహిబ్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. మృతులు కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముక్త్సర్ బస్టాండ్ నుంచి ఓ ప్రైవేట్ బస్సు అమృత్‌సర్‌కు బయలుదేరింది. భారీ వర్షంలో ముక్త్సర్-కొట్కాపురా హైవేపై ప్రయాణిస్తున్న బస్సు వారింగ్ అనే గ్రామ సమీపంలో ఉన్న కెనాల్ బ్రిడ్జి వద్దకు రాగానే అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యాహ్నాం 1.25 గంటల ప్రాంతంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వంతెనపై ఉన్న రహదారి ఆద్వాన్నంగా ఉండటంతోపాటు నీరు నిలిచి పోవడం వల్లే బస్సు ప్రమాదానికి గురై ఉంటుందని స్థానిక వ్యక్తి తెలిపాడు.
Also Read: Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఇకపై లోయర్ బెర్త్‌లు ఆ ప్రయాణీకులకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook