7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండుసార్లు అంటే జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ సూచీ ఆధారంగా డీఏ పెంపు ఉంటుంది. మరో రెండు నెలల్లో అంటే జూలైలో డీఏ పెరగాల్సి ఉంది. ఫలితంగా ప్రతి ఉద్యోగి జీతభత్యాల్లో మార్పు రానుంది. జూలై నెలలో జీతం ఎంత పెరగనుందో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి, ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డీఏ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది. జనవరి నెల డీఏ మార్చ్ నెలలో ఎరియర్లతో సహా వచ్చింది. డీఏ పెరిగితే జీతంలో కూడా మార్పు వస్తుంది. జూలై నెలలో ఈ ఏడాది అంటే 2024లో రెండవసారి పెరగాల్సి ఉంది. జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెరిగింది. ఈసారి కూడా అంటే జూలై నెలలో డీఏ 4 శాతం పెరగవచ్చనేది అంచనా. ఉద్యోగి బేసిక్ శాలరీ 50 వేలు అయితే 4 శాతం డీతో పెంపు అంటే 2 వేలు పెరుగుతుంది. అంటే జూలై జీతం 2 వేలు అధికంగా వస్తుంది.
ప్రతి ఏటా జూలై నెలలో ఉద్యోగుల జీతం 3 శాతం పెరుగుతుంటుంది. అంటే కనీస వేతనం 50 వేలున్నవారికి 3 శాతం చొప్పున 1500 రూపాయలు పెరుగుతుంది. అంటే జూలై నెలలో ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి జీతం 3 శాతం చొప్పున 1500 రూపాయలు, డీఏ 4 శాతం చొప్పున 2000 రూపాయలు మొత్తం 3500 రూపాయలు జూలై జీతంలో పెరుగుతుంది. అటు జీతం ఇటు డీఏ పెంపు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూలై నుంచి లెక్కగట్టి ఎరియర్లతో సహా చెల్లించేస్తారు.
Also read: App Permissions: యాప్స్‌కు కెమేరా, లొకేషన్ అనుమతులిచ్చేశారా, ఎలా మార్చుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook