7th Pay Commission: డీఏ పెంపుపై గందరగోళం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ఎలా..?

7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? లేదా ఇప్పుడు ఉన్నదానికే యాడ్ చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి AIPCI Index డేటా కూడా ఇంకా రిలీజ్ చేయలేదు.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 26, 2024, 06:32 PM IST
7th Pay Commission: డీఏ పెంపుపై గందరగోళం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ఎలా..?

7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏ పెంచడంతో మొత్తం 50 శాతానికి చేరుకుంది. అయితే 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. మొత్తం డీఏ 50 శాతం చేరుకుంటే.. ఆ మొత్తాన్ని బేసిక్ శాలరీలో కలిపి మళ్లీ జీరో నుంచి డీఏను లెక్కించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డియర్‌నెస్ అలవెన్స్ డేటా ఫిబ్రవరిలో అప్‌డేట్ చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. జీరో నుంచి డీఏను లెక్కిస్తారా..? లేదా 50 శాతం నుంచి మళ్లీ పెంచుతారా అనే విషయంపై క్లారిటీ లేదు. ప్రతి నెలా లేబర్ బ్యూరో లెక్కలు విడుదల చేస్తుండగా.. ఫిబ్రవరి నెలకు డేటాను మార్చి 28న విడుదల చేయాల్సి ఉండగా ఇంకా చేయలేదు. 

Also Read: Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు  

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో జూలై నెలలో పెరుగుతుంది. AICPI ఇండెక్స్ తాజా డేటాలో 138.9 పాయింట్లకు చేరుకుంది. దీని ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 50.84 శాతానికి పెరిగింది. ఈ డేటా జనవరి 2024 నెలలో విడుదల చేసింది. లేబర్ బ్యూరో షీట్ నుంచి ఫిబ్రవరికి సంబంధించిన డేటా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దీంతో డీఏను జీరోకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే కొత్త డేటాను రిలీజ్ చేయలేదని అంటున్నారు. డీఏ ఎంత పెరుగుతుందనేది నిపుణులకు కూడా అంచనా వేయడం సాధ్యం కావడం లేదు.

అయితే తదుపరి డీఏ కూడా 4 శాతం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే మొత్తం డీఏ 54 శాతానికి చేరుకుంటుంది. AICPI ఇండెక్స్ డేటా విడుదల అయితే డీఏ పెంపుపై క్లారిటీ రానుంది. జనవరి డేలా ప్రకారమైతే 51 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన డేటా ఆధారంగా డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వివిధ రంగాల నుంచి సేకరించిన ద్రవ్యోల్బణం డేటా ద్రవ్యోల్బణంతో పోల్చితే ఉద్యోగుల భత్యం ఎంత పెరగాలనే విషయం తేలుతుంది. 

ఫిబ్రవరి లెక్కలు వస్తే.. 51 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. 5 నెలల సంఖ్యలు ఇంకా రావాల్సి ఉంది. ఈసారి కూడా 4 శాతం పెరగడం ఖాయమని భావిస్తున్నారు. డియర్‌నెస్ అలవెన్స్ సున్నా నుంచి ప్రారంభమైనా లేదా 50 శాతం నుంచి లెక్కించినా 4 శాతం పెంపు ఉండే అవకాశం ఉంది.  

Also Read: Renault Kiger Price: టాటా పంచ్‌తో పోటీ పడుతున్న Renault Kiger.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇలా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News