LTC Rule Changed: ఇటీవల ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో ప్రకటన చేసింది. ఎల్‌టీసీలో వెళ్లే ఉద్యోగులకు విమాన టిక్కెట్ బుకింగ్‌కు సంబంధించి తీపి కబురు అందించింది. ఈ ప్రక్రియ మరింత సులువు చేసేందుకు ఈ మార్పు చేసింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన మెమోరాండం ప్రకారం.. ఇంకా ఎటువంటి క్లెయిమ్ పొందని ఎవరైతే వారికి కోసం మార్పులు చేసింది. ఆగస్ట్ 29, 2022 వరకు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్న ఉద్యోగులు నేరుగా ప్రయోజనం పొందుతారు.
దీంతో ట్రావెల్ ఏజెంట్ల ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్న ఎల్‌టీసీని క్లెయిమ్ చేసుకోవచ్చని డీఓపీటీ తెలిపింది. అలాగే వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు బుకింగ్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో చాలా మంది ఉద్యోగులు LTCని క్లెయిమ్ చేసుకోలేకపోయారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో ముగ్గురు రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్లు M/s బాల్మర్ లారీ & కంపెనీ లిమిటెడ్ (BLCL), M/s అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్ (ATT), ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) విమానానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి.
నిర్ణీత సమయ స్లాట్‌లో LTC కోసం విమాన టిక్కెట్‌ను బుక్ చేస్తున్నప్పుడు.. విమాన ఛార్జీలు చౌకైన ధర కంటే 10 శాతం ఎక్కువగా ఉండాలి. ఒక ఉద్యోగి BLCL, ATT, IRCTC వంటి రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకుంటే.. ఆ ఉద్యోగి చౌకైన ఛార్జీని ఎంచుకున్నట్లు పరిగణిస్తారు. ఎల్‌టీసీ ట్రావెల్ కోసం ఎల్‌టీసీ లేబుల్ టిక్కెట్‌లను జారీ చేయాలని అన్ని ట్రావెల్ ఏజెంట్‌లకు సూచించింది.
ప్రత్యేక రాయితీ పథకం కింద అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రధాన కార్యాలయం నుంచి నేరుగా NER, జమ్మూ & కాశ్మీర్, అండమాన్ నికోబార్, లడఖ్‌లకు విమానాలను బుక్ చేసుకునే సందర్భాల్లో.. అదే సమయ స్లాట్ ప్రింటౌట్ తీసుకోవాలి. ఆ స్లాట్‌లో టికెట్ అందుబాటులో లేకుంటే,, క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం తదుపరి స్లాట్ ఫ్లైట్ ప్రింటవుట్‌ను ఉంచుకోవచ్చు.
Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వం బంపర్ బహుమతి.. 7వ వేతన సంఘం అమలుపై కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook