7th Pay Commission DA Hike Updates: డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు గుడ్‌న్యూస్. బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుండడంతో ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్‌గా కేంద్రం డీఏ పెంపు ప్రకటన చేయనుంది. ఈ సంవత్సరం మొదటి డీఏ 4 శాతం పెరిగ్గా.. రెండో డీఏ కూడా 4 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. దీనికి నేడు కేబినెట్ ఆమోదం లభిస్తే.. ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల ఉండనుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పెండింగ్ డీఏలపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.
ప్రస్తుతం డీఏ 42 శాతం ఉంది. అందరూ అంచనా వేస్తున్నట్లు 4 శాతం పెంచితే.. 46 శాతానికి పెరుగుతుంది. పెంచిన డీఏ జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. మొత్తం మూడు నెలల ఆరియర్స్ కలిపి ఉద్యోగులకు జీతంతో కలిపి అందజేస్తారు. ఈ ఏడాది మొదటి డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేశారు. గత మూడేళ్ల నుంచి పరిశీలిస్తే.. ప్రభుత్వం ప్రతి నెల అక్టోబర్‌లోనే డీఏ ప్రకటిస్తోంది. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
4 శాతం పెరిగితే జీతం ఎంత పెరుగుతుంది..?
బేసిక్ శాలరీ-రూ.56,900 అయితే ఇలా..
==>> బేసిక్ శాలరీ- రూ.56,900
==>> కొత్త డీఏ (46 శాతం)-నెలకు రూ.26,174
==>> ప్రస్తుత డీఏ (42 శాతం)-నెలకు రూ.23,898
==>> డీఏ ఎంత పెరిగింది- నెలకు రూ.2276
==>> ఏటా పెరుగుదల ఎంత..?- రూ.27,312
బేసిక్ శాలరీ-రూ.18 వేలు అయితే ఇలా..
==>> బేసిక్ శాలరీ -రూ.18,000
==>> కొత్త డీఏ (46 శాతం)-నెలకు రూ.8,280
==>> ప్రస్తుత డీఏ (42 శాతం)-నెలకు రూ.7,560
==>> డీఏ ఎంత పెరిగింది-నెలకు రూ.720
==>> ఏటా పెరుగుదల ఎంత..?- రూ.8,640
ఇది కూడా చదవండి : Allu Arjun: అసలు పుష్ప సినిమా కథ నేషనల్ అవార్డు టీం వారికి పూర్తిగా అర్థమైందా?
ఇది కూడా చదవండి : Rashmika Mandanna: రష్మిక హాట్ ఫొటో లీక్.. ఇంటర్‌నెట్ వైరల్ చేసిన టీమ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడే గుడ్‌న్యూస్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇలా..!