7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెలలో డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం డీఏ పెంపు ప్రకటించవచ్చు. సాధారణంగా ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది. ఒకటి జనవరిలో, రెండవది జూలైలో ఉంటుంది. డీఏ పెంపుపై గతంలో మార్చి, సెప్టెంబర్ నెలల్లో కేంద్రం నుంచి ప్రకటన వచ్చేది.కరోనా కారణంగా జనవరి 2020 నుంచి, జూన్ 30 2021 వరకు కేంద్రం డీఏని నిలిపివేసింది. తిరిగి జూలై 2021న డీఏని పునరుద్ధరించింది. ఈ ఏడాది మొదటి డీఏని జనవరిలో ప్రకటించిన కేంద్రం.. రెండో డీఏను వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. అలాగే పెన్షనర్లకు డీఆర్ పెంచే అవకాశం ఉంది. ఈ పెంపుతో 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందుతారు.
డీఏ ఎంతవరకు పెరిగే ఛాన్స్..
7వ వేతన సంఘం సిఫారసుల మేరకు గతేడాది జూలైలో కేంద్రం డీఏని 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది.అదే ఏడాది అక్టోబర్‌లో మరో 3 శాతం డీఏ ప్రకటించింది. ఇక ఈ ఏడాది జనవరిలో మరో 3 శాతం డీఏ ప్రకటించడంతో ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అందుతోంది. రాబోయే జూలైలో కేంద్రం మరో 5 శాతం డీఏ పెంపు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో ఉద్యోగుల డీఏ 39 శాతానికి చేరుతుంది.
డీఏ ఏరియర్స్ :
కోవిడ్ కాలంలో 18 నెలల కాలానికి కేంద్రం బకాయిపడ్డ డీఏని ఏరియర్స్ రూపంలో ఒకేసారి చెల్లించే అవకాశం ఉంది. అదే జరిగితే పెండింగ్‌లో ఉన్న రూ.2 లక్షల మొత్తం ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో జమవుతుంది. ఉద్యోగుల పే బ్యాండ్, పే స్ట్రక్చర్‌ని బట్టి డీఏ ఏరియర్స్ ఉంటుంది.
పీఎఫ్ వడ్డీ
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై 2021-22 సంవత్సరానికి వడ్డీ రేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 8.10గా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే ఆ మేరకు వడ్డీ రేటు ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమవుతుంది. ఈ లెక్కన ఇంచుమించుగా ఒకేసారి డీఏ, డీఏ ఏరియర్స్, పీఎఫ్ వడ్డీ ఉద్యోగుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది.
Also Read: Ranbir Kapoor First Wife : అలియాతో రెండో పెళ్లి.. మొదటి భార్య ఎవరో చెప్పిన రణబీర్
Also Read: Puri Warns to Bandla Ganesh: చీప్‌గా వాగొద్దు.. నాలుక కొరికేసుకోవడం మంచిదన్న పూరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.