7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. ఉద్యోగులకు డీఏ పెంచేందుకు మోదీ సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యం(DA)ను 4 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికార వర్గాలు సైతం ధృవీకరిస్తున్నాయి. తాజాగా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరింది. దీని వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకూరనుంది.
7వ వేతన సంఘం సిఫార్సులతో ఈఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏను పెంచారు. దీంతో మూల వేతనంలో డీఏ 34 శాతంగా ఉంది. తాజా నిర్ణయంతో డీఏ 38 శాతానికి చేరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నామని..ఇన్నాళ్లు నెరవేరిందంటున్నారు. కేంద్ర సర్కార్ డీఏ పెంచడంతో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు డీఏ పెంచనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు సార్లు డీఏను సవరిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా డీఏను జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు. ఐతే ఈసారి కొత్త జీతాలతోపాటు వీటిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏను మూడు పెంచారు. తాజాగా 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Also read:CM Jagan: రాయలసీమ రైతులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌న్యూస్..!
Also read:CM Kcr: సింగరేణి కార్మికులకు శుభవార్త..దసరా కానుక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి