Dharwad Accident: ధార్వాడ్ లో ఘోర ప్రమాదం...చెట్టును ఢీకొన్న క్రూజర్.. ఏడుగురు దుర్మరణం!

Dharwad Accident: కర్ణాటకలోని ధార్వాడ్ లో విషాదం చోటుచేసుకుంది. క్రూజర్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 10:19 AM IST
Dharwad Accident: ధార్వాడ్ లో ఘోర ప్రమాదం...చెట్టును ఢీకొన్న క్రూజర్.. ఏడుగురు దుర్మరణం!

Dharwad Accident: కర్ణాటకలోని ధార్వాడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. క్రూజర్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధార్వాడ్ (Dharwad) రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదా గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. 

నిశ్చితార్థ వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో క్రూజర్ లో 20 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు.. అనన్య (14), హరీష్ (13), శిల్పా (34), నీలవ్వ (60), మదుశ్రీ (20), మహేశ్వరయ్య (11), శంబులింగం (35)గా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ధార్వాడ తాలూకా బెనకట్టి గ్రామానికి చెందిన వారిగా సమాచారం. 

క్షతగాత్రులను హుబ్బళిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ధార్వాడ పోలీసు సూపరింటెండెంట్ కృష్ణకాంత్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. 

Also read: Delhi Traffic Police Challan: కారులో హెల్మెట్ ధరించలేదని జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీస్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News