Chariot Catches Fire: అగర్తల: భారీ భక్తజన సందోహం మధ్య జగన్నాథ స్వామి వారిని రథంపై ఊరేగిస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రథంపై భాగం హై టెన్షన్ వైరుకి తగిలి విద్యుదాఘాతానికి గురవడంతో పాటు మంటలు చెలరేగిన గురైన దుర్ఘటనలో ఏడుగురు చనిపోగా మరో 18 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. త్రిపురలోని ఉనోకొటి జిల్లా కుమార్‌ఘాట్ లో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని త్రిపుర రాజధాని అగర్తలాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు.
కుమర్‌ఘాట్‌లో జగన్నాథ్ స్వామి రథ యాత్ర జరుగుతుండగా సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రథం పూర్తిగా ఇనుముతో తయారు చేసినది కావడంతో 133kv హై టెన్షన్ వైరుతో కాంటాక్టులోకి రావడంతోనే ఆ రథాన్ని లాగుతున్న భక్తులకు, ఆ రథాన్ని ఆనుకుని పట్టుకుని నడుస్తున్న భక్తులకు ఒకేసారి విద్యుత్ షాక్ తగిలింది. భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో విద్యుత్ షాక్ కొట్టిన వారి నుంచి వారిని ఆనుకుని ఉన్న వారికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. అదే సమయంలో రథం పూర్తిగా పూలు, వస్త్రాలతో అలంకరించి ఉండటంతో మంటలు కూడా చెలరేగడం వల్లే ప్రమాదం తీవ్రత పెరిగింది అని స్థానికులు చెబుతున్నారు.
In a tragic incident, several devotees have lost their lives & some other people sustained injuries due to electrocution during Ulta Rath Yatra at Kumarghat today.
My deepest condolences to the bereaved families who lost their near and dear ones in the tragedy.
In this…
— Prof.(Dr.) Manik Saha (@DrManikSaha2) June 28, 2023
ఇది కూడా చదవండి : 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. మూడు రోజుల్లో క్లారిటీ
ఈ ఘోర విషాదంపై త్రిపుర సీఎం మానిక్ సాహా ట్విటర్ ద్వారా స్పందించారు. మృతుల కుటుంబాలు, వారి బంధుమిత్రులకు తన సంతాపాన్ని ప్రకటించిన సీఎం మానిక్ సాహా.. ఈ కష్టకాలంలో త్రిపుర సర్కారు వారికి అండగా ఉంటుంది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Rajyasabha Elections: ఆ పది రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు, షెడ్యూల్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK