66 medical students in Dharwad test positive for COVID-19: కర్ణాటకలోని ధర్వాద్‌లో కరోనా విజృంభిస్తోంది. 66 మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ 66 మంది వైద్య విద్యార్థులు రెండు డోసుల (Two doses) వ్యాక్సిన్ (vaccine) తీసుకున్నారు. అయినప్పటికీ మరోసారి కరోనా (Corona) వ్యాప్తి చెందడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ విద్యార్థులంతా ఎస్‌డీఎం మెడికల్ కాలేజీకి చెందిన వారు. పెద్ద ఎత్తున విద్యార్థులు కరోనా బారినపడడంతో మెడికల్ కాలేజీ (Medical College) యాజమాన్యం అప్రమత్తమైంది. విద్యార్థులు ఉంటున్న రెండు హాస్టళ్లను మూసివేశారు. కాలేజీ క్యాంపస్‌లో ఉన్న 400 మందికి కరోనా పరీక్షలు (Corona tests) నిర్వహిస్తున్నారు.
Also Read : Chiranjeevi: అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ టిక్కెట్ల ధరలు ఉండాలి: చిరంజీవి
ఇక బెంగళూరులోని సీఎం బొమ్మై కార్యాలయంలో కూడా ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్‌గా (Corona positive) బయట పడింది. దీంతో ఆఫీసులో శానిటైజేషన్ చేశారు. అధికార నివాసం కృష్ణాలో 50 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఇద్దరు సిబ్బందికి కరోనాగా వెల్లడైంది. వివిధ పనుల నిమిత్తం విధానసౌధకు తిరగడంతో అక్కడి సిబ్బందికి కరోనా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విధానసౌధలోని సీఎం ఆఫీసును కూడా శానిటైజ్ (Sanitize) చేశారు.
Also Read : IND vs NZ 1st Test:మయాంక్ విఫలం..చెలరేగిన గిల్! లంచ్ బ్రేక్ కు భారత్ స్కోర్ ఎంతంటే??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook