Baby girl died: కరోనాతో 6నెలల పసికందు మృతి

కరోనా వైరస్‌ సోకిన ఆరు నెలల పసికందు మృతి చెందిన ఘటన చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రిలో (PGIMER) గురువారం చోటుచేసుకుంది. ఇటీవలె గుండె ఆపరేషన్‌ కోసం పాపను ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పాపకు కరోనా లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు మంగళవారం ఆ పసికందుకు కోవిడ్-19 టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో ఆ పసికందుకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆ పాప గురువారం మధ్యాహ్నం 12.47 గంటలకు మృతిచెందింది. కరోనా వైరస్ కారణంగానే ఆ పాప చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించారు. 

Last Updated : Apr 23, 2020, 11:47 PM IST
Baby girl died: కరోనాతో 6నెలల పసికందు మృతి

చండీఘడ్: కరోనా వైరస్‌ సోకిన ఆరు నెలల పసికందు మృతి చెందిన ఘటన చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రిలో (PGIMER) గురువారం చోటుచేసుకుంది. ఇటీవలె గుండె ఆపరేషన్‌ కోసం పాపను ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పాపకు కరోనా లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు మంగళవారం ఆ పసికందుకు కోవిడ్-19 టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో ఆ పసికందుకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆ పాప గురువారం మధ్యాహ్నం 12.47 గంటలకు మృతిచెందింది. కరోనా వైరస్ కారణంగానే ఆ పాప చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించారు. 

Also read : Telangana: కొత్తగా 27 కరోనా కేసులు.. జీహెచ్ఎంసీలోనే అధికం

కరోనాతో పాప చనిపోయిన నేపథ్యంలో ఆమెకు కరోనా ఎలా సోకిందనే అంశంపై దృష్టి సారించిన అధికారులు.. అంతకంటే ముందుగా ముందు జాగ్రత్త చర్యగా ఆ చిన్నారి తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News