మహారాష్ట్రలో ( Maharashtra ) ఘోరం జరిగిపోయింది. 5 అంతస్తుల భవనం ( 5 storey building ) కుప్పకూలింది. శిధిలాల కింద 70 మంది వరకూ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
సాయంత్రం 7 గంటల కావస్తోంది. ఆ ఇరుకైన ఇళ్లో ఎవరికి వారు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొందరు అప్పుడే పని ముగించుకుని ఇంటికి వచ్చారు. మరి కొందరు ఇంకా రావల్సి ఉంది. ఇంతలో ఆ భవనంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. ఐదు అంతస్థుల భవనం ( Building collapsed ) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రాయ్ గడ్ ( Raigad District ) జిల్లా మహద్ తాలూకా ( mahad tehsil ) లోని కాజల్ పురా ( kajalpura ) లో జీ ప్లస్ 4 ( G plus 4 ) శైలిలో నిర్మించిన భవనమిది. పూణే నుంచి ఎన్డీఆర్ఎఫ్ ( ndrf teams ) బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయి. గాయాలపాలైన 17 మందిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంకా 50 మంది ( over 50 trapped ) వరకూ శిధిలాల్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియలేదు. ఈ భవనం పదేళ్ల క్రితం నిర్మించిందని తెలుస్తోంది.
Today at about 1850 hrs, A G+4 building collapsed in Kajalpura area of Mahad Tehsil in Dist. Raigad, Maharashtra.
About 50 people are feared to be trapped. 3 teams of 5 BN NDRF have moved: National Disaster Response Force (NDRF) pic.twitter.com/XlWegCSHqq— ANI (@ANI) August 24, 2020