రాజ్‌భవన్‌లో దొంగలు హల్చల్

మహారాష్ట్ర గవర్నర్‌ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లో  దొంగలు హల్చల్ చేశారు. భవన పరిసరాల్లో గల అయిదు ఎర్రచందనం చెట్లను దుంగలుగా నరికి తీసుకెళ్లిపోయారు. అయితే అంతమంది సెక్యూరిటీ కళ్లు కప్పి ఈ పని ఎలా చేయగలిగారన్నది ఇప్పటికే అనేక అనుమానాలకు తావిస్తోంది.

Last Updated : May 3, 2018, 09:58 PM IST
రాజ్‌భవన్‌లో దొంగలు హల్చల్

మహారాష్ట్ర గవర్నర్‌ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లో  దొంగలు హల్చల్ చేశారు. భవన పరిసరాల్లో గల అయిదు ఎర్రచందనం చెట్లను దుంగలుగా నరికి తీసుకెళ్లిపోయారు. అయితే అంతమంది సెక్యూరిటీ కళ్లు కప్పి ఈ పని వారు ఎలా చేయగలిగారన్నది ఇప్పటికే అనేక అనుమానాలకు తావిస్తోంది. సీసీ టీవీలు ఉండే ఆ ప్రాంతంలో వారు అంత ధైర్యంగా ఆ పని చేస్తున్నా కనీసం ఎవరికీ అనుమానం కూడా రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు అంటున్నారు.

ఏప్రిల్ 30వ తేదిన జరిగిన ఈ ఘటనకు సంబంధించి చతుశృంగి పోలీస్‌స్టేషనులో కేసు నమోదైంది. అయితే ఆ ప్రాంతంలో ఆ ఘటన జరగడం తొలిసారి కాదని.. గతంలో కూడా కొందరు ఆగంతకులు భవనం లోపలికి రావడానికి ప్రయత్నించారని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా సెక్యూరిటీ కళ్లు కప్పి ఇలాంటి పనులు చేస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై పలువురు విమర్శిస్తున్నారు.

పూణెలో ఈ మధ్యకాలంలో ఎర్రచందనాన్ని దొంగలిస్తున్న కేసులు కాస్త ఎక్కువగానే నమోదవ్వడం గమనార్హం. గతంలో ఓ స్కూలు ఆవరణలోకి కూడా ఇలాగే దొంగలు తెగబడి ఎర్రచందనం చెట్లను నరికారు. ప్రస్తుతం మహారాష్ట్రకు గవర్నర్‌గా విద్యాసాగరరావు వ్యవహరిస్తున్నారు

Trending News