karnal rice mill colapse: హర్యానాలోని కర్నాల్‌లో రైస్ మిల్లు కూలిపోవడంతో కనీసం నలుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కర్నాల్‌లోని తారావోరిలోని మూడు అంతస్తుల శివశక్తి రైస్‌మిల్ భవనం పైకప్పు కుప్ప కూలింది. ప్రమాద సమయంలో రైస్‌మిల్‌లో దాదాపు 200 మంది వరకు కార్మికులు నిద్రిస్తున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అధికారులు శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరుకు 100 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతి చెందిన నలుగురును చందన్, అవదేశ్, సంజయ్ మరియు పంకజ్‌లుగా పోలీసులు గుర్తించారు. మృతులంతా బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందినవారిగా తెలిపారు. చాలా మంది కార్మికులు ఇప్పటికీ శిథిలాల లోపల చిక్కుకున్నారని భయపడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి.. సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Navi Mumbai: మహారాష్ట్రలో విషాదం.. వడదెబ్బకు 11 మంది మృత్యువాత.. వందలాది మందికి అస్వస్థత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Rice Mill Collapse in karnal: రైస్ మిల్లు కుప్పకూలి.. నలుగురు మృతి, 20 మందికి గాయాలు..