ఢిల్లీ: ఇరాక్‌లో భారతీయుల కిడ్నాప్ ఘటన విషాదాంతమైంది. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న ఆ 39 మంది భారతీయులు మరణించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు.
‘సుదీర్ఘ విచారణ తర్వాత.. ఆ 39 మంది భారతీయులు మృతిచెందినట్లు వెల్లడైంది. డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం వారి మృతదేహాలను బాగ్దాద్‌కు తరలించారు. వీరిలో 38 మంది డీఎన్‌ఏ వారి బంధువుల డీఎన్‌ఏతో మ్యాచ్ అయ్యింది. ఒకరిది మాత్రం70 శాతం కలిసినట్లు ఇరాక్ అధికారులు సోమవారం సమాచారం అందించారు. మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు కేంద్ర మంత్రి వీకే సింగ్ ఇరాక్ వెళ్తారు. మృతదేహాలను తీసుకొచ్చే విమానం మొదట అమృత్‌సర్, తర్వాత పాట్నా, కోల్కతాకు వెళ్తుంది’ అని సుష్మాస్వరాజ్ రాజ్యసభలో తెలిపారు.
Loud slogans raised by opposition as EAM Sushma Swaraj seeks permission from Lok Sabha Speaker to deliver statement on death of 39 Indians in Iraq's Mosul, says, 'It is something sad that I want to tell the house and it cannot be done in this ruckus.' pic.twitter.com/dQ7k2ZdLWH
— ANI (@ANI) March 20, 2018