గత 24 గంటల్లో 134 మంది మృతి

తొలుత కరోనా వైరస్ ప్రభావం భారత్‌పై లేదని, ఆందోళన అక్కర్లేదని చేసిన నిర్లక్ష్యమే నేడు ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది.

Last Updated : May 14, 2020, 11:24 AM IST
గత 24 గంటల్లో 134 మంది మృతి

తొలుత కరోనా వైరస్ ప్రభావం భారత్‌పై లేదని, ఆందోళన అక్కర్లేదని చేసిన నిర్లక్ష్యమే నేడు ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. రోజురోజుకూ దేశంలో కరోనా మరణాలు వందకు పైగా ఉంటున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,722 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 78,003కు చేరుకుంది.  Photos: హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

గడిచిన రోజులో దేశ వ్యాప్తంగా 134 మందిని కరోనా మహమ్మారి బలిగిగొంది. దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 2,549 మంది మరణించారు. మొత్తం 78 వేల పాజిటివ్ కేసులకుగానూ చికిత్స అనంతరం 26,234 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.  నిరాడంబరంగా హీరో నిఖిల్ పెళ్లి

రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 25,922 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుజరాత్ 9,267, తమిళనాడు 9,227 కరోనా పాజిటివ్ కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో 975 మంది కరోనా కాటుకు బలయ్యారు. గుజరాత్‌లో 566, మధ్యప్రదేశ్‌లో 232 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 7,998 మందికి కరోనా సోకింది. రానాకు కాబోయే భార్య ఎవరు, ఫ్యామిలీ నేపథ్యం వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో 2137 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 47 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో 1367 పాజిటివ్ కేసులు రాగా, గురువారం ఉదయం నాటికి 34 మంది కరోనా కాటుకు బలయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News