Gang Rape: మహారాష్ట్రలో ఘోరం.. బాలికపై 29 మంది సామూహిక అత్యాచారం!

Maharashtra: ముంబయిలో నిర్భయ తరహా ఘటనను ఇంకా మరిచిపోకముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం వెలుగుచూసింది. థానె జిల్లాలో పదిహేనేళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా 29 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడిన పాశవిక ఘటన కలకలం రేపుతోంది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2021, 08:13 PM IST
  • మహారాష్ట్రలో దారుణం
  • బాలికపై 29 మంది సామూహిక అత్యాచారం
  • 26 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Gang Rape: మహారాష్ట్రలో ఘోరం.. బాలికపై 29 మంది సామూహిక అత్యాచారం!

Maharashtra: మహారాష్ట్రలోని థానే(Thane)లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా అత్యంత కౄరంగా 29 మంది సామూహిక అత్యాచారానికి(Gang Rape) ఒడిగట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. బుధవారం రాత్రి బాధితురాలు డోంబివాలిలోని మాన్పాడ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. 

స్నేహితుడే ప్రధాన నిందితుడు
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బాలిక స్నేహితుడు. ముందుగా ఈ ఏడాది జనవరిలో మైనర్‌(Minor Girl)పై అఘాయిత్యానికి పాల్పడి, ఈ దృశ్యాలను వీడియో(Video) తీశాడు. ఈ వీడియోను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌(Blackmail) చేస్తూ మిగతావారు ఆమెపై పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారు. అలా జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 29 మంది తనపై అత్యాచారాని(Rape)కి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: Breaking News: బెంగళూరు భారీ పేలుడు... ముగ్గురు సజీవ దహనం.. పలువురికి గాయాలు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వారందరిపై పోక్సో(POCSO) చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దత్తాత్రేయ వెల్లడించారు. గత తొమ్మిది నెలలుగా బాధితురాలిపై అత్యాచారం పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News