India Corona Cases: దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు... భారీగా మరణాలు నమోదు!!

India Corona Cases: భారత్​లో నిన్నటి రోజుతో పోలిస్తే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఒక్కరోజే 2,34,281 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 11:34 AM IST
  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
  • భారీగా కరోనా మరణాలు నమోదు
  • 14.50 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు
India Corona Cases: దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు... భారీగా మరణాలు నమోదు!!

India Covid-19 Update: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 2,34,281 కేసులు (Corona Cases in India)వెలుగుచూశాయి. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 4,10,92,522కు చేరింది. వైరస్ తో మరో 893 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,94,091కు చేరింది. కరోనా కేసులు (Covid 19) తగ్గినా.. మరణాల సంఖ్య పెరగడం భయాందోళకు గురిచేస్తోంది. 

కరోనా నుంచి 3,52,784 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 3,87,13,494కు చేరింది. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టిన్ కేసులు (Active Cases in india) ఉన్నాయి.  దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 62,22,682 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య (Covid-19 Vaccination) 1,65,70,60,692కు చేరింది.

Also Read: India vaccination: దేశంలో 95 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News