22 Killed 8 Passengers Injured after a Bus fall into a Ravine: పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఘోర ప్రమాదం (accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 22 మంది మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు సుధ్నోటి జిల్లాలోని బలోచ్ ప్రాంతం నుంచి పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండి వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. రోడ్డు పక్కన దాదాపు 500మీ. లోతులో బస్సు పడిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు.
డాన్ దినపత్రిక కథనం ప్రకారం బస్సు లోయలో పడిపోయిన విషయాన్ని మొదట ఓ చిరువ్యాపారి గుర్తించాడు. స్థానికుడైన ఓ మత పెద్దకు ఫోన్ ద్వారా విషయాన్ని చేరవేశాడు. వెంటనే ఆ మతపెద్ద మసీదు వద్ద ఉన్న మైకులో ఈ విషయాన్ని ప్రకటించాడు. స్థానికులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కోరాడు. దీంతో కొంతమంది అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Diwali Offers: రూ. 21,999 శాంసంగ్ గెలాక్సీ ఎం31 ఫోన్ కేవలం రూ.13,999కే.. త్వరపడండి
పీఓకె పర్వత ప్రాంతం కావడంతో ఇక్కడి రోడ్లపై డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం.. వాహనాల్లో సాంకేతిక సమస్యల కారణంగా ఇక్కడ తరచూ ప్రమాదాలు(road accidents) చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో ఇదే పీఓకెలోని పూంచ్ జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థులు సహా పలువురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. దాదాపు 32 మంది గాయపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి