Rape and Murder: ఖాళీ భవనంలో కుళ్లిపోయిన స్థితిలో యువతి మృతదేహం

Rape and Murder in Mumbai: ముంబైలోని ఓ ఖాళీ భవనంలో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టమ్ రిపోర్టులో వెల్లడైంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 01:56 PM IST
  • ముంబై కుర్లాలో యువతిపై హత్యాచార ఘటన
    ఖాళీ భవనంలో యువతి మృతదేహం లభ్యం
    యువతి తలపై బలమైన గాయాలు
Rape and Murder: ఖాళీ భవనంలో కుళ్లిపోయిన స్థితిలో యువతి మృతదేహం

Rape and Murder in Mumbai: ముంబైలో దారుణం జరిగింది. 20 ఏళ్ల ఓ యువతి హత్యాచారానికి (Rape and Murder) గురైంది. ఓ ఖాళీ భవనంలోని 13వ అంతస్తులో ఆమె మృతదేహాన్ని (Dead body) గుర్తించారు. ఓ వీడియో చిత్రీకరణ నిమిత్తం ఆ భవనంలోకి వెళ్లిన ముగ్గురు యువకులు యువతి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. కుర్లా ప్రాంతంలోని హెడీఐఎల్ కాంపౌండ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

పోస్టుమార్టమ్ రిపోర్టులో యువతిపై అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు (Mumbai Police) వెల్లడించారు. ఆమె తలపై బలమైన గాయాలు గుర్తించామన్నారు. ఘటనపై ఐపీసీ సెక్షన్ 376 (Rape), 302 (Murder) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ప్రణయ్ అశోక్ మాట్లాడుతూ... గురువారం (నవంబర్ 25) సాయంత్రం ముగ్గురు యువకులు ఓ వీడియో చిత్రీకరణ నిమిత్తం ఆ భవనంలోకి వెళ్లినట్లు తెలిపారు. 13వ అంతస్తులో యువతి మృతదేహాన్ని (Dead body) వారు గుర్తించారని... ఆ వెంటనే తమకు సమాచారం అందించారని పేర్కొన్నారు.

యువతి మృతదేహం అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉందని... ఆమె ఎవరన్నది ఇంకా గుర్తించలేదని ప్రణయ్ అశోక్ (Mumbai Police) తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై (Rape and Murder) దర్యాప్తుకు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని... వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read: Gutkha Man: ప్లకార్డుతో ప్రత్యక్షమైన కాన్పూర్ 'గుట్కా మ్యాన్'...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News