Karnataka Hijab Row: కర్ణాటకలో మళ్లీ రగడ..హిజాబ్‌ ధరించి పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అడ్డుకున్న సిబ్బంది

Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్‌ రగడ మళ్లీ మొదలైంది. హిజాబ్‌ ధరించి పరీక్షరాసేందుకు వచ్చిన స్టూడెంట్స్‌ ను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్ధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటు పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ ను కూడా హైకోర్టు డిస్మిస్‌ చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 04:20 PM IST
  • మళ్లీ కర్ణాటకలో హిజాబ్‌ రగడ
  • హిజాబ్‌ ధరించి పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు
  • అనుమతించని సిబ్బంది
Karnataka Hijab Row: కర్ణాటకలో మళ్లీ రగడ..హిజాబ్‌ ధరించి పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అడ్డుకున్న సిబ్బంది

Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్‌ రగడ మళ్లీ మొదలైంది. హిజాబ్‌ ధరించి పరీక్షరాసేందుకు వచ్చిన స్టూడెంట్స్‌ ను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్ధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటు పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ ను కూడా హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

 కర్ణాటకలో చల్లారిందనుకున్న హిజాబ్‌ రగడ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే హిజాబ్‌ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు విద్యార్ధులను సిబ్బంది అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హిజాబ్‌ తొలగించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. అయితే ఆ ఇద్దరు స్టూడెంట్స్‌ కూడా హిజాబ్‌ తొలగించేది లేదని.. అవసరమైతే పరీక్షలు రాయమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఉడిపిలోని విద్యోదయ పీయూ కాలేజీలో జరిగింది.

 కర్ణాటక వ్యాప్తంగా సుమారుగా 6.84 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 3 లక్షల 46 వేల 936 మంది బాలురు, 3 లక్షల 37 వేల 319 మంది బాలికలు ఉన్నారు. ఇందుకోసం అధికారులు 1076 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ప్రాక్టికల్‌ పరీక్షల కోసంకూడా 1030 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్‌కు దాదాపుగా 267349 మంది స్టూడెంట్స్‌ హాజరుకానున్నారు. హిజాబ్‌ ధరించి వస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇప్పటికే కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్‌ స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాలను పాటిస్తున్న సిబ్బంది.. హిజాబ్‌ ధరించి వచ్చిన ఆ విద్యార్థులను అడ్డుకున్నారు.

అటు పరీక్ష కేంద్రాల వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రంలోనికి సెల్‌ ఫోన్లు తీసుకెళ్లడం కూడా నిషేధించారు. ఎగ్జామ్‌ సెంటర్‌ చుట్టు పక్కల 200 మీటర్ల వరకు ప్రొబిహిటేడ్‌ జోన్‌ విధించారు. మరోవైపు హిజాబ్‌ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ఉడిపి ప్రి యూనివర్సిటీ మహిళా కాలేజీకి చెందిన నలుగురు విద్యార్ధులు ఇప్పటివరకు హాల్‌ టికెట్‌ కూడా తీసుకోలేదు. హిజాబ్‌ ధరించి వస్తే అనుమతించమన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హాల్‌ టికెట్లు తీసుకోలేదు. ఇక హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరవుతామంటూ పలువురు విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ డిస్మిస్‌ అయింది. కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రీతురాజ్‌ అవాస్తీ నేతృత్వంలోని స్పెషల్‌ బెంచ్‌ ఈ పిటిషన్‌ డిస్మస్‌ చేసింది. ఇస్లాం మతం ప్రకారం హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరుకావడం తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది.

Also Read: Prashanth Kishor strategy: కాంగ్రెస్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?

Also Read: amilisai Soundararajan News: గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అటెండర్ అనుమానాస్పద మృతి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News