Covid-19 Cases in India: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 1,07,474 కొత్త కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ తో 865 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మెుత్తం మరణాల సంఖ్య 5,01,979కి చేరింది. కరోనా నుంచి 2,13,246 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 4,04,61,148కి చేరింది.
India reports 1,07,474 fresh #COVID19 cases, 2,13,246 recoveries and 865 deaths in the last 24 hours.
Active cases: 12,25,011
Death toll: 5,01,979
Daily positivity rate:7.42%Total vaccination: 1,69,46,26,697 pic.twitter.com/jbbqjX9NQz
— ANI (@ANI) February 6, 2022
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.42% శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 12,25,011 కొవిడ్ యాక్టివ్ (Covid-19 Active Cases in India) కేసులున్నాయి. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.90 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.91 శాతానికి చేరింది. దేశంలో కొత్తగా 45,10,770 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,69,46,26,697 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 22 లక్షల మందికి (Corona Cases in World Wide) కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ తో 8 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.39 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5,751,840 కు పెరిగింది.
Also Read: Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook