10 ప్రశ్నలతో ఆప్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మనోజ్ తివారి

గత ఐదేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన వైఫల్యాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి 10 ప్రశ్నలు సంధించారు. మీడియా సమావేశంలో మనోజ్ తివారి మాట్లాడుతూ..

Last Updated : Jan 13, 2020, 05:25 PM IST
10 ప్రశ్నలతో ఆప్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మనోజ్ తివారి

న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన వైఫల్యాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి 10 ప్రశ్నలు సంధించారు. మీడియా సమావేశంలో మనోజ్ తివారి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అరవింద్ కేజ్రీవాల్ తప్పిచుకు తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. రోడ్లపైకి మురుగునీరు వస్తుందనీ, నగరంలో కాలుష్యం తీవ్రమైందనీ, ప్రజా రవాణా తదితర అంశాలపై నిర్లక్ష్యం వహించిందని ఆయన ధ్వజమెత్తారు. 

ఇవే అంశాలపై ఢిల్లీ బీజేపీ నాయకులు ప్రశ్నించినప్పుడు సమస్యలపై స్పందన తెలియజేయకుండా మిగతా రాష్ట్రాల్లోని పనితీరును సాకుగా చూపి తప్పించుకోవడం అరవింద్ కేజ్రీవాల్ కు పరిపాటిగా అయ్యిందని ఆయన  ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల ఐదేళ్ల సమయాన్ని వృధా చేసిందని, ఇప్పటివరకు పాఠశాలలకు సంబంధించి శాశ్వతమైన భవనాలు ఏర్పాటు చేయలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
  
బీజేపీ అధికారంలోకి వస్తే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కంటే ఐదు రెట్లు ఎక్కువగా పరిపాలన అందించి ఢిల్లీ ప్రజలకు ఒక అద్భుతమైన పాలనా అందిస్తామని ఆయన అన్నారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 8న ఓటింగ్ జరగనుండగా, 11న ఫలితాలు వెలుడనున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News