Hyderabad Rains: హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం.. అవస్థలు పడుతున్న జనం..

Hyderabad: హైదరాబాద్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిన్న భాగ్యనగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2023, 09:49 AM IST
Hyderabad Rains: హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం.. అవస్థలు పడుతున్న జనం..

Heavy Rains in Hyderabad: భారీ వర్షాలకు భాగ్యనగరం అల్లాడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ విలవిల్లాడుతోంది. వరద నీరు కాలనీలను ముంచెత్తడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసినదీలో నీటి ప్రవాహం పెరిగింది. రహదారులపై నీరు నిలిచిపోయి ఉండటంతో వాహనదారులు తీవ్రఇక్కట్లు పడుతున్నారు. 

ఒక్క రోజులోనే రికార్డు స్థాయి వర్షపాతం

నిన్న రాజధానిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జూలై నెల మెుత్తం కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే పడింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 188.3 మి.మీ. వర్షం నమోదైంది. గత 30 ఏళ్లలో జులై నెల సగటు వర్షపాతం 162 మి.మీ.గా ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి.  జులై నెలలో అత్యధిక వర్షపాతం 2012లో 115.1 మి.మీ.గా నమోదుకాగా.. ఆ తర్వాత ఆ స్థాయిలో కురవడం ఇదే తొలిసారి.

మరో నాలుగు రోజులపాటు వర్షాలు.. 

కుండపోత వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో కూడా ఇన్ ఫ్లో ప్రారంభమైంది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. వర్షాల కారణంగా రామగుండం ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తిని కూడా నిలిపేశారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ఇవాళ, రేపు హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (GHMC) పరిథిలోని అన్ని విద్యాస్థంస్థలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు. 

Also Read: Electricity Dept Issues: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లతో ప్రమాదం పొంచి ఉంటే ఈ నెంబర్లలో ఫిర్యాదు చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News