Ramdas Athawale: కేంద్రమంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన టీ కాంగ్రెస్ సీనియర్ లీడర్.. ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం..

Ramdas Athawale: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు 71 మంది క్యాబినేట్, స్వతంత్య్ర, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో రామ్ దాస్ అఠావలె మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 11, 2024, 08:10 PM IST
Ramdas Athawale: కేంద్రమంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన టీ కాంగ్రెస్ సీనియర్ లీడర్.. ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం..

Ramdas Athawale: కేంద్రంలో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన మంత్రి వర్గంలో స్థానం సంపాధించి మరోసారి ప్రమాణ స్వీకారం చేసారు రామ్ దాస్ అఠావలె. ఈయనకు నరేంద్ర మోడీ సామాజిక న్యాయం,సాధికారత సహాయ మంత్రి హోదా కట్టబెట్టారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్ దాస్ అఠావలెను తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం నేషనల్ అంబేడ్కర్ సేన తరఫున ఘనంగా సన్మానించారు. రామ్ దాస్ అఠావలె గత 30 యేళ్లుగా దళిత,బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు. ఆయన సేవలను మెచ్చి... నరేంద్రమోదీ మరోసారి కేంద్ర మంత్రిని చేసారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో కలిసి మల్లు శివరాం నేషనల్ అంబేడ్కర్ సేన తరఫున పుష్పగుచ్చం ఇచ్చి... శాలువాతో సన్మానించారు.

కేంద్రమంత్రి సేవలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్బంగా కోరారు. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం, సాధికారత లభించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు నేరవేరినట్లని ఆయన పేర్కొన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా రామ్ దాస్ అఠావలె రాజకీయాల్లో రాణిస్తూ... పేదలకు ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. తన తండ్రి గారైన స్వర్గీయ కీర్తిశేషులు మల్లు అనంత రాములు కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఆయన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిర గాంధికి ఎంతో నమ్మకంగా మెలిగారు.  అలాగే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పీసీసీ అధ్యక్షునిగా సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇప్పుడు తమ బాబాయిలైన మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవిలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నరేంద్రమోడీ మంత్రి వర్గంలో తన మిత్రుడు రామ్ దాస్ కేంద్ర సహాయక మంత్రి పదవిని పొందడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఒక మిత్రునిగా ఆయనను ఇలా కలిసి సన్మానించడం చాలా హ్యాపీగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా తమ స్నేహం కొనసాగుతుందని తెలిపారు. ఇద్దరి ఆశయాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని సాధించడమే అన్నారు.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News