Health Facts: ఇటీవలి కాలంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మనవ చర్మం సాధారణంగా 64 శాతం నీటితో ఉంటుంది. తగినంత నీరు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యం బాగుంటుందని చాలా మంది భావిస్తుంండటం ఇందుకు కారణం. ఇదే కారణంతో చర్మ సౌదర్యాన్ని కాపాడుకునేందుకు.. సెలెబ్రెటీలు కూడా నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. ఫిట్నెస్ ట్రైనర్లు, నిపుణులు కూడా నీళ్లు ఎక్కువగా తాగమని సలహా ఇస్తుంటారు.
మరి నిజంగానే చర్మం ఆరోగ్యం బాగుండాలంటే.. నీరు నిజంగానే ఔషధంలా పని చేస్తుందా? లేదా చౌకగా దొరుకుతుంది కదా అని నీటిని ఎక్కువగా తాగమని చెబుతున్నారా? నిపుణులు ఏమంటున్నారు?
డీ హైడ్రేషన్ బారిన పడితే..
శరీరం నుంచి ఎక్కువగా నీటిని కోల్పోవడమే.. డీ హైడ్రేషన్. ఈ పరిస్థితి చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.
చర్మంలోని వివిధ రకాల నిర్మణాలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటన్నింటికి ముఖ్యమైంది నీరే. డీ హైడ్రేషన్ బారిన పడినప్పుడు.. ఈ నిర్మాణాలు దెబ్బతింటాయి. అప్పుడు చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆకులు, పువ్వులు వాడిపోయినప్పుడు ఎలా అవుతుందో అలా చర్మం తయారవుతుంది. తగినంత నీరు శరీరంలో ఉన్నప్పుడు చర్మం తాజాగా నిగనిగ లాడుతూ కనిపిస్తుంది. అందుకే డీ హగైడ్రేషన్ బారిన పడినప్పుడు.. ముఖంతో పాటు శరీరమంతా నిస్తేజంగా కనిపిస్తుంది.
తగినంత నీరు శరీరంలో లేకపోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం వచ్చే వీలుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా చర్మంలో నీటి శాతం తగ్గితే..చర్మం ముడతలు పడపటం వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరుకు ఉన్న పరిశోధనల కారణంగా నీరు శరీరానికి అత్యంత అవసరమైన వనరు అని తెలిసింది.
మరిన్ని..
చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచడంలో నీరు చాలా బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. తగినంత నీటిని తాగినప్పటికీ.. బయటి నుంచి కూడా మాయిశ్చర్స్ను ఉపయోగించినప్పుడే చర్మం పూర్తి ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
తగినంత నీరు తాగుతున్నా.. ఆరోగ్య వంతమైన చర్మం ఉంటాలంటే.. ఆహారం విషయంలోనూ జాగ్రత్త అవసరమట. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారం తరచూ తినడం చర్మానికి హాని చేయగలదని చెబుతున్నారు విశ్లేషకులు.
నీరు అనేది చర్మం ఆరోగ్యాన్నే కాదు.. శరీరంలో అన్ని భాగాలకు ముఖ్యమే. శరీర ఊష్టోగ్రత అదుపులో ఉండాలంటే.. తనగినంత నీరు అవసరం. వాతావరణం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడకుండా నీరు ఉపయోగపడుతుంది.
Also read: COVID-19 Fourth Wave: కరోనా ఫోర్త్‌వేవ్ తప్పదా ! డబ్ల్యూహెచ్‌వో కూడా అదే హెచ్చరిక
Also read: Kidney Stone Patients: మీ కిడ్నీల్లో రాళ్లున్నాయా..అయితే ఈ ఆహార పదార్ధాలు పూర్తిగా మానేయాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook