Metabolism: మెటబోలిజం అంటే ఏంటి, ప్రాముఖ్యతేంటి, ఎలా మెరుగుపర్చుకోవడం

Metabolism: అందరూ కోరుకునేది మెరుగైన ఆరోగ్యమే. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన సూత్రం బాడీ మెటబోలిజం సరిగ్గా ఉండటం. దీనినే జీవక్రియ అంటారు. జీవక్రియ ప్రాధాన్యత ఏంటి, ఎలా మెరుగుపర్చుకోవాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2022, 11:42 PM IST
Metabolism: మెటబోలిజం అంటే ఏంటి, ప్రాముఖ్యతేంటి, ఎలా మెరుగుపర్చుకోవడం

Metabolism: అందరూ కోరుకునేది మెరుగైన ఆరోగ్యమే. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన సూత్రం బాడీ మెటబోలిజం సరిగ్గా ఉండటం. దీనినే జీవక్రియ అంటారు. జీవక్రియ ప్రాధాన్యత ఏంటి, ఎలా మెరుగుపర్చుకోవాలో తెలుసుకుందాం..

నిత్య జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవన శైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ప్రతి సమస్యకు ఆసుపత్రుల చుట్టూ పరుగెట్టాల్సిన అవసరం లేదు. వంటింట్లో లభించే అద్భుతమైన ఔషధాలతోనే చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం మాత్రం ఒక్కటే. శరీరంలో మెటబోలిజం సరిగ్గా లేకపోవడం. అంటే జీవక్రియ మందగిస్తేనే వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. మెటబోలిజంకు అంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. మెటబోలిజం సరిగ్గా లేకపోతే..జీర్ణ సమస్యలు అక్కడి నుంచి ఇతర సమస్యలు ఇలా ఒకదాని నుంచి మరొకటి వెంటాడుతాయి. 

అంతటి ప్రాముఖ్యత కలిగిన మెటబోలిజం మెరుగుపర్చుకునేందుకు కూడా అద్భుతమైన చిట్కాలున్నాయి. అందులో ముఖ్యమైంది వాము నీళ్లు లేదా వాము. అజ్వైన్ లేదా వాముతో అద్భుత ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా జీవక్రియ మెరుగుపడుతుంది. 

మనకు ఎదురయ్యే సకల రోగాలకు కారణం జీవక్రియ లేదా మెటబాలిజం మందగించడమే. జీవక్రియ మెరుగ్గా ఉంటే ఏ రోగాలు అంత సులభంగా దరిచేరవు. మరి ఆ మెటబాలిజంను మెరుగుపర్చేది వాము లేదా అజ్వైన్ వాటర్. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. రోజూ వాము నీరు తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు బరువు తగ్గించుకునేందుకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని జీవక్రియను వాము నీరు మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఊబకాయం నియంత్రించవచ్చంటారు వైద్య నిపుణులు. 

అయితే క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాము నీరు తీసుకోవల్సి ఉంటుంది. ఒక చెంచా వాము గింజల్ని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాల్సి ఉంటుంది. ఉదయం ఆ నీటీని మరిగించి..వడపోసి తాగాలి. ఇలా చేయడం ద్వారా..వివిధ రకాల ఆరోగ్య సమస్యల్నించి దూరం చేసుకోవచ్చు.

వాముతో ఇతర ప్రయోజనాలు

ఇక మహిళలకు సంబంధించి తరచూ పీరియడ్స్ సమయంలో భరించలేని కడుపు నొప్పి అనేది సర్వ సాధారణంగా కన్పిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు నీటిలో వామును బాగా మరగబెట్టి చల్లార్చి తీసుకోవాలి. ఫలితంగా కడుపు నొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 

వాము లేదా అజ్వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలెక్కువ. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, నికోటిన్ యాసిడ్, కార్పొహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. వామునీరు క్రమం తప్పకుండా తీసుకుంటే.. గొంతు నొప్పితో బాధపడేవాళ్ళు, నోటి నుంచి దుర్వాసన వెలువడేవారికి ఉపశమనం కలుగుతుంది. 

Also read: Empty Stomache Foods: పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తప్పవు..తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News